EPFO Big Decision: ఈపీఎఫ్ఓ ఖాతాదారుల ప్రయోజనాల కోసం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తుంటుంది. ఉద్యోగులకు మరింత సామాజిక భద్రత అందించేందుకు, ఉద్యోగుల నమ్మకాన్ని నిలుపుకునేందుకు కొత్త స్కీమ్ అందుబాటులోకి తెచ్చింది. తాజాగా నవంబర్ 30న కొత్త పథకాన్ని ఆమోదించింది. ఈ స్కీమ్‌లో భాగంగా పాత పీఎఫ్ బకాయిలను ఎలాంటి జరిమానా లేకుండా చెల్లించవచ్చు.
ఈపీఎఫ్ స్కీమ్ 1952 ప్రకారం పీఎఫ్ ఎక్కౌంట్ హోల్డర్లకు సెటిల్మెంట్ తేదీ వరకూ వడ్డీ చెల్లింపు ఉంటుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వివిధ యాజమాన్య సంస్థలు తమ పాత బకాయిలను ఎలాంటి అదనపు పెనాల్టీ లేకుండా చెల్లించేందుకు , ఏవిధమైన న్యాయపరమైన సమస్యలు లేకుండా చూసేందుకు వీలు కల్పిస్తుంది. ఎందుకంటే చాలా సంస్థలు ఉద్యోగుల పీఎఫ్ బకాయిలు చెల్లించకుండా వదిలేస్తుంటాయి. తరువాత చెల్లించాలంటే జరిమానాతో చెల్లించే పరిస్థితి ఉండేది. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. 2024-25 ఆర్ధిక సంవత్సరం బడ్డెట్లో ప్రకటించినట్టుగా ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్ సెంటివ్ స్కీమ్ ఇది.
1952 ఈపీఎఫ్ స్కీమ్‌ను సవరణ చేసేందుకు కూడా సీబీటీ బోర్డు ఆమోదించింది. దీని ప్రకారం సెటిల్మెంట్ తేదీ వరకూ ఎక్కౌంట్ హోల్డర్లకు వడ్డీ చెల్లింపు ఉంటుంది. ఇప్పుడున్న నియమాల ప్రకారం ప్రతి నెలా 24వ తేదీలోగా సెటిల్ అయ్యే క్లెయిమ్స్‌కు వడ్డీ గత నెల వరకే చెల్లిస్తున్నారు. ఇప్పుడీ సవరణ తరువాత పీఎఫ్ సభ్యులకు మరింత అదనపు వడ్డీ లభిస్తుంది. ఎంప్లాయి డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు 2024 ఏప్రిల్ 28 నుంచి వర్తిస్తాయి. \
Also read: Maharashtra CM: అలిగిన ఏక్ నాథ్ షిండే.. సీఎం పదవిపై తేలని లొల్లి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.