ఆంధ్రప్రదేశ్( Andhra pradesh ) లో కరోనా కేసుల సంఖ్య మరింతగా పెరిగింది. కొత్తగా 8 వేల 555 కేసులు నమోదవడంతో...మొత్తం కేసుల సంఖ్య లక్షన్నర దాటింది. గత రెండ్రోజులతో పోలిస్తే కాస్త తక్కువగా ఉండటం ఊరట కల్గిస్తోంది.
ఏపీలో కరోనా కేసుల ( Ap corona cases ) సంఖ్య పెరుగుదల కొనసాగుతోంది. తాజాగా ఏపీ ఆరోగ్య శాఖ కరోనా బుల్లెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో కొత్తగా 8 వేల 555 కేసులు నమోదయ్యాయి. మరోవైపు రికార్డు స్థాయిలో గత 24 గంటల్లోనే 52 వేల 834 కోవిడ్ నిర్ధారణ ( Covid 19 tests ) పరీక్షల్ని నిర్వహించింది ఏపీ ప్రభుత్వం ( Ap Government ). దీంతో 20 లక్షల 65 వేల 407 పరీక్షలతో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ఏపీలో మొత్తం లక్షా 58 వేల 764 కేసులకు చేరింది. మరోవైపు గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 6 వేల 272కు చేరుకుంది. ఇప్పటివరకూ మొత్తం 82 వేల 886 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత రెండు మూడు రోజుల్నించి పోలిస్తే...గత 24 గంటల్లో నమోదైన కేసుల సంఖ్యలో స్వల్పంగా తగ్గుదల కన్పించడం ఊరట కల్గించే పరిణామంగా ఉంది. Also read: AP: రాష్ట్రంలో కొత్త జోన్ల వివరాలివే
ఇక కరోనా ( Corona virus ) కారణంగా గత 24 గంటల్లో 67 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకూ కరోనా వైరస్ కారణంగా మృతి చెందినవారి సంఖ్య 1474కు చేరుకుంది. ప్రస్తుతం ఏపీలో 74 వేల 404 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. Also read: AP: ఇక ఆ చట్టం లేదు..కొత్తం చట్టం ఏర్పాటు