Guntur Stampede: గుంటూరు తొక్కిసలాటలో ముగ్గురి మృతి.. స్పందించిన సీఎం జగన్

Stampede at Chandrababu Naidu's Meeting: కందుకూరు దుర్ఘటన ఇంకా మర్చిపోకముందే తాజాగా గుంటూరులో మరోసారి టీడీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు నిర్వహించిన చంద్రన్న కానుక సభ మరోసారి తొక్కిసలాటకు కారణమైంది. ఈ తొక్కిసలాటలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు మహిళలు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 2, 2023, 06:38 AM IST
  • గుంటూరు తొక్కిసలాట ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తంచేసిన సీఎం జగన్
  • మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన
  • గాయపడినవారికి ఆర్ధిక సహాయంపై ప్రకటన చేసిన జగన్
Guntur Stampede: గుంటూరు తొక్కిసలాటలో ముగ్గురి మృతి.. స్పందించిన సీఎం జగన్

Stampede at Chandrababu Naidu's Meeting: అమరావతి: గుంటూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన చంద్రన్న కానుక సభలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి వైయస్‌. జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో పలువురు మరణించడం తనను తీవ్రంగా కలచివేసిందని సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. చంద్రబాబు సభ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించి వారిని ఆదుకోవాలని సీఎం జగన్ గుంటూరు జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. 

ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయంతో పాటు రూ.50వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

 

ఇదిలావుంటే, రెండు, రోజుల వ్యవధిలోనే చంద్రబాబు నాయుడు నిర్వహించిన రెండు వేర్వేరు సభల్లో రెండుసార్లు తొక్కిసలాట చోటుచేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నడూ లేని విధంగా ఒకేసారి వెంటవెంటనే రెండు ఘటనలు జరగడం యాదృశ్చికమా లేక దీనివెనుక రాజకీయ కోణం ఏమైనా దాగి ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

ఇది కూడా చదవండి : Stampede in Chandrababu Guntur Sabha: గుంటూరు బాబు సభలో తొక్కిసలాట..ముగ్గురి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం!

ఇది కూడా చదవండి : Vidadala Rajani: అరకేజీ నూనె, కందిపప్పు, చీర ఇస్తామని చెప్పి ప్రాణాలు తీశారు.. ఏకిపారేసిన మంత్రి విడదల రజిని

ఇది కూడా చదవండి : Ys Jagan on Pawan Kalyan:ఈ భార్య కాకపోతే ఆ భార్య..రాష్ట్రానికి ఇదేం ఖర్మ రా.. పవన్ పై జగన్ పరోక్ష విమర్శలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News