Eluru mystery disease: ఏలూరు వింత వ్యాధి ఇంకా కొలిక్కి రాలేదు. కచ్చితమైన కారణం, పరిష్కారం ఏంటనేది ఇంకా తెలియలేదు. నిపుణులు సూచిస్తున్న ఏ అంశాన్ని తేలిగ్గా తీసుకోవద్దని..మరింత లోతుగా దర్యాప్తు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు.
ఏలూరు వింత వ్యాధి ( Eluru mystery disease ) ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలవరం కల్గించింది. ఏలూరులో ప్రారంభమైన వింత వ్యాధికి కారణాలేంటనేది ప్రాధమికంగా నిర్ధారణైంది తప్ప..కచ్చితంగా ఇంకా తెలియలేదు. కొన్ని పరీక్షల నివేదికలు ఇంకా రావల్సి ఉన్నాయి. పూర్తిగా నిర్ధారణ జరిగే వరకూ నిపుణులు సూచించిన ఏ విషయాన్నీ తేలిగ్గా తీసుకోవద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( ap cm ys jagan ) ఆదేశించారు. ఎక్కడా పొరపాటు జరగడానికి వీల్లేదని..ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకోవాలని సూచించారు. బ్లడ్ శాంపిళ్లలో లెడ్, ఆర్గనో క్లోరిన్, ఆర్గనో ఫాస్పరస్ కన్పిస్తోందని...అయితే ఇవి ఎలా వచ్చి చేరాయో కచ్చితంగా కనిపెట్టాలని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటన మరోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే..ఎలా అనేది కచ్చితంగా నిర్ధారణ కావల్సిందేనన్నారు. కేంద్ర వైద్య, సాంకేతిక, పరిశోధన సంస్థల నిపుణులు, ఉన్నతాధికార్లతో ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
పూర్తి స్థాయిలో పరీక్షలు
ఏలూరు అస్వస్థత ఘటనకు నీరు కారణమా కాదా అనేది ముందుగా నిర్ధారణ చేసుకోవాలి. సేంద్రీయ సేద్యం, సేంద్రీయ ఉత్పత్తుల్ని ప్రోత్సహించాలని సూచించారు. బియ్యం శాంపిళ్ల పరీక్షలు కూడా చేయించాలన్నారు. పురుగు మందులపై జాగ్రత్త వహించాలని...రసాయనాలు విక్రయిస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆహారపదార్ధాలు కలుషితం కాకుండా చూడాలన్నారు. ఇప్పటికే 16 నీటి శాంపిల్స్ ( Water Sample test ) పరీక్షించగా వాటిలో చెప్పుకోదగ్గ స్థాయిలో లెడ్ , నికెల్ లేదని ఢిల్లీ ఎయిమ్స్ ( Delhi AIIMS ) ఇప్పటికే తేల్చి చెప్పింది. ఆర్గనో క్లోరిన్ ఉందా లేదా అనేది నిర్ధారించేందుకు సీఐఎస్ఎఫ్ఎల్ ఫలితాలకు సమయం పడుతుంది. మరోవైపు బియ్యంలో మెర్క్యురీ ఆనవాళ్లు కన్పించాయని...పురుగు మందుల అవశేషాలే దీనికి కారణంగా చెబుతున్నారు. నీటిలో ఈ కోలి కూడా సాధారణ స్థాయిలోనే ఉందని తేలింది. Also read: Eluru Mystery Disease: ఏలూరు తాగునీటిపై ఢిల్లీ ఎయిమ్స్ నివేదికలో ఏముందో తెలుసా…