AP Curfew: ఏపీలో కర్ఫ్యూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న వైఎస్ జగన్

AP Curfew: కరోనా మహమ్మారి కట్టడికై దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ కర్ఫ్యూ, లాక్‌డౌన్‌లు పొడిగిస్తున్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ లాక్‌డౌన్ సడలింపు సరైంది కాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో ఎన్ని రోజులంటే..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 31, 2021, 03:07 PM IST
AP Curfew: ఏపీలో కర్ఫ్యూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న వైఎస్ జగన్

AP Curfew: కరోనా మహమ్మారి కట్టడికై దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ కర్ఫ్యూ, లాక్‌డౌన్‌లు పొడిగిస్తున్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ లాక్‌డౌన్ సడలింపు సరైంది కాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో ఎన్ని రోజులంటే..

దేశంలో కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) ధాటికి జనం విలవిల్లాడుతున్నారు. కరోనా సంక్రమణను కట్టడి చేసేందుకు దేశంలోని అత్యధిక రాష్ట్రాలు కర్ఫ్యూ(Curfew)లేదా లాక్‌డౌన్ పాటిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ముందు నైట్ కర్ఫ్యూ అమలు చేయగా..తరువాత లాక్‌డౌన్ , పగటి కర్ఫ్యూ అమలు చేశాయి. తెలంగాణలో మే 12వ తేదీ నుంచి రోజుకు 20 గంటల లాక్‌డౌన్ అమలు చేస్తూ..మరో పదిరోజుల పాటు లాక్‌డౌన్ పొడిగించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. 

ఇటు ఆంధప్రదేశ్‌లో మే 5వ తేదీ నుంచి రోజుకు 18 గంటల కర్ప్యూ(Curfew) అమలవుతోంది. ఇవాళ ఆ కర్ఫ్యూని మరో పదిరోజులపాటు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ( Ap government) నిర్ణయం తీసుకుంది. కర్ఫ్యూ వేళల్లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఉదయం 6 గంటల్నించి  మద్యాహ్నం 12 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపు ఉంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan) కోవిడ్‌పై సమీక్ష జరిపి..కర్ఫ్యూపై నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ స్టేట్, ఇంటర్ డిస్ట్రిక్ట్ ప్రయాణాల్లో అమలవుతున్న ఈ పాస్ విధానం అలాగే ఉంటుంది. 

Also read: Anandaiah Ayurvedic Medicine: ఆనందయ్య ఆయుర్వేద మందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News