Hari Babu Kambhampati, Governor of Mizoram: మిజోరం గవర్నర్‌గా బీజేపీ సీనియర్ నేత, విశాఖపట్నం మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు నియమితులయ్యారు. దేశంలోని 8 రాష్ట్రాలకు గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్‌కు సైతం గవర్నర్ పదవి ఇవ్వడం గమనార్హం. కర్ణాటక గవర్నర్‌గా గెహ్లాట్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
హరియాణా గవర్నర్‌గా బండారు దత్తాత్రేయను నియమించారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా కొనసాగుతున్న దత్తాత్రేయను హరియాణాకు బదిలీ చేశారు. మిజోరం గవర్నర్‌గా ఏపీ బీజేపీ నేత, విశాఖ మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబుకు బాధ్యతలు అప్పగించారు. మధ్యప్రదేశ్ గవర్నర్‌గా మంగూభాయ్ ఛగన్‌భాయ్ పటేల్, కర్ణాటక గవర్నర్‌గా థావర్‌చంద్ గెహ్లాట్, త్రిపుర గవర్నర్‌గా సత్యదేవ్ నారాయణ్, గోవా గవర్నర్‌గా పీఎస్ శ్రీధరన్ పిళ్లై, ఝార్ఖండ్ గవర్నర్‌గా రమేష్ బైస్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్ నియమితులయ్యారు. కేంద్ర మంత్రి విస్తరణ నేపథ్యంలో పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం, బదిలీ జరిగింది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్‌ను కర్ణాటక గవర్నర్‌గా నియమించారు.
Also Read: Union Cabinet Extension: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు కసరత్తు పూర్తి, త్వరలో ప్రకటన
President appoints Thaawarchand Gehlot as Governor of Karnataka, Hari Babu Kambhampati as Governor of Mizoram, Mangubhai Chhaganbhai Patel as Governor of Madhya Pradesh, and Rajendra Vishwanath Arlekar as Governor of Himachal Pradesh pic.twitter.com/ZA1GrFrgLV
— ANI (@ANI) July 6, 2021
కంభంపాటి హరిబాబు 1978లో జనతా యువమోర్చాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా చేశారు. 1991-1993 కాలంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యునిగా, ఆపై 1993-2003 మధ్య కాలంలో ఏపీలో భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీగా సేవలు అందించారు. 1999లో విశాఖపట్నం-1 నియోజకవర్గం నుండి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మార్చి 2014లో బీజేపీ ఏపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా గెలుపొందారు.
♦మిజోరం గవర్నర్ గా బీజేపీ నేత, విశాఖ మాజీ ఎంపి కంభంపాటి హరిబాబు నియామకం.@HariBabuBJP @BJP4Andhra @SVishnuReddy @somuveerraju pic.twitter.com/fn4KxZlJeC
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) July 6, 2021
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook