రేపటి నుంచే కొత్త మద్యం పాలసీ

రేపటి నుంచే కొత్త మద్యం పాలసీ

Last Updated : Sep 30, 2019, 03:35 PM IST
రేపటి నుంచే కొత్త మద్యం పాలసీ

అమరావతి: ఏపీలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే, దశలవారీ మద్య నిషేధం అమలు చేస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ఆ పార్టీ అధినేత, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అప్పుడు మాట ఇచ్చిన విధంగానే రేపటి నుంచి నూతన మద్యం పాలసీని అమలు చేయబోతున్నారు. ఇదివరకు ఉన్న ప్రైవేట్‌ మద్యం దుకాణాల గడువు రాష్ట్ర వ్యాప్తంగా నేటితో ముగియనుంది. దీంతో మంగళవారం నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలు అందుబాటులోకి రానున్నాయి. 

ఏటా 20 శాతం మద్యం దుకాణాలను తొలగిస్తామని ప్రకటించిన సీఎం వైఎస్ జగన్.. అందులో భాగంగానే అన్ని జిల్లాల్లో 20 శాతం దుకాణాలను మూసేసి మద్య నిషేధంలో మొదటి అడుగేయగా... రేపటి నుంచి నూతన మద్యం పాలసీ అమలుతో మరో అడుగేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా మద్యం దుకాణాలను తగ్గించడం ద్వారా క్రమక్రమంగా మందుబాబులకు మద్యం లభించకుండా చేయడమే లక్ష్యంగా తమ పరిపాలన ఉండబోతోందని ఏపీ సర్కార్ చెబుతోంది.

Trending News