ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలను బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తరఫున ఈ రోజు ఏపీ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఏయూ స్నాతకోత్సవ మందిరంలో విడుదల చేశారు. ఈ పరీక్షల్లో 94.48% మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఈ ఫలితాలను SSCAP అనే ఆండ్రాయిడ్ యాప్ ద్వారా పొందవచ్చు. ఈ యాప్ను గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఎస్ఎమ్ఎస్ ద్వారా ఫలితాలను పొందాలని భావించే వారు SSC<space>ROLL NUMBER ఫార్మాట్లో 56263 నెంబరుకు మెసేజ్ కూడా పంపించవచ్చు. అలాగే www.resn18.bseap.org, www.bse.ap.gov.in మరియు www.bseap.org వెబ్సైట్ల ద్వారా కూడా ఈ పరీక్ష ఫలితాలను అభ్యర్థులు పొందవచ్చు. ఈసారి పరీక్షల్లో బాలురు 94.41% ఉత్తీర్ణత సాధించగా.. బాలికలు 94.56% ఉత్తీర్ణత సాధించడం విశేషం.
ఇటీవలే నిర్వహించిన ఏపీ పదవ తరగతి పరీక్షలకు మొత్తం 6,17,484 మంది విద్యార్థులు హాజరయ్యారు. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 268 పరీక్షా కేంద్రాల్లో ఈ ఎగ్జామ్స్ నిర్వహించారు. ఈసారి పరీక్షల్లో ప్రకాశం జిల్లా 97.93% ఉత్తీర్ణత శాతంతో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా, ఆఖరి స్థానంలో 80.37% శాతంతో నెల్లూరు జిల్లా నిలిచింది.