AP Elections 2024: ఏపీ ఎన్నికల్లో పొత్తు పొడిస్తే..బీజేపీ ఆశిస్తున్న స్థానాలివే, ఇవాళ అమిత్ షాతో చంద్రబాబు భేటీ

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ప్రతిపక్షాలు పొత్తుల లెక్కల్లో మునిగితేలుతున్నాయి. తెలుగుదేశం-జనసేన కూటమిలో బీజేపీ కలుస్తుందా లేదా అనేది తేలకముందే బీజేపీ షరతులు హల్‌చల్ చేస్తున్నాయి. ఆ వివరాలు మీ కోసం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 7, 2024, 10:47 AM IST
AP Elections 2024: ఏపీ ఎన్నికల్లో పొత్తు పొడిస్తే..బీజేపీ ఆశిస్తున్న స్థానాలివే, ఇవాళ అమిత్ షాతో చంద్రబాబు భేటీ

AP Elections 2024: ఏపీ ఎన్నికల వేళ పొత్తు రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలో దిగుతుంటే ప్రతిపక్షపార్టీలు తెలుగుదేశం-జనసేన ఇప్పటికే జతకట్టాయి. ఇక బీజేపీ కలుస్తుందా లేదా అనేది మరో 4-5 రోజుల్లో తేలిపోనుంది. ఈ క్రమంలో బీజేపీ కొన్ని కండీషన్స్ విధించింది. వాటికి చంద్రబాబు సిద్దంగా ఉన్నారో లేదో తేలాల్సి ఉంది.

ఏపీలో బలంగా పాతుకుపోయున్న వైఎస్ జగన్‌ను ఓడించాలంటే జనసేనతో పాటు బీజేపీ పొత్తు కూడా అవసరమనేది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆలోచనగా ఉంది. అందుకే బీజేపీ పొత్తు గురించి స్పష్టం చేయకపోయినా వేచి చూస్తోంది. పొత్తులపై త్వరలోనే స్పష్టత రావచ్చని తెలుస్తోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ ఛీప్ జేపీ నడ్డాతో భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పొత్తులపై చర్చలు జరగనున్నాయి. పొత్తులో భాగంగా బీజేపీకు కేటాయించే ఎంపీ, లోక్‌సభ స్థానాలపై చర్చించనున్నారు. ఇవాళ చంద్రబాబు-అమిత్ షా-జేపీ నడ్డాతో జరిగే చర్చల్లో అంశాలపై ఈ నెల 9వ తేదీన జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. తెలుగుదేశం-జనసేనతో కలిస్తే బీజేపీ కొన్ని షరతులు విధించనున్నట్టు సమాచారం. 

పొత్తులో భాగంగా బీజేపీ 10-15 ఎమ్మెల్యే స్థానాలు,  4-5 ఎంపీ స్థానాలు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. 2014 బీజేపీ 4 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు గెల్చుకుంది. గతంలో గెలిచిన స్థానాలతో పాటు అదనంగా కొన్ని స్థానాలు ఆశిస్తోంది. గతంలో గెలిచిన విశాఖపట్నం, నర్శాపురంతో పాటు రాజమండ్రి, ఏలూరు, కాకినాడ స్థానాల్ని ఆశిస్తోంది. హీనపక్షం 10-12 స్థానాలు, 2-3 ఎంపీ స్థానాలకు తగ్గదని తెలుస్తోంది. 

జనసేన-టీడీపీ పొత్తులో భాగంగా ఇప్పటికే జనసేనకు 25 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలకు తగ్గకుండా కేటాయించాల్సి వస్తుంది. అంటే బీజేపీ-జనసేన రూపంలో 35-37 అసెంబ్లీ, 4-6 ఎంపీ స్థానాలు తెలుగుదేశం పార్టీకు తగ్గిపోతాయి. అంటే తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న దాదాపు 40 మందిపై ప్రభావం పడవచ్చు.

ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న తరుణంలో అధికార పార్టీ అన్ని సామాజిక సమీకరణాలతో అభ్యర్ధుల్ని ప్రకటిస్తున్నప్పుడు తెలుగుదేశం-జనసేన-బీజేపీ పొత్తు పొడిస్తే సమీకరణాలు దాటుకుని టికెట్ కేటాయించడం కష్టం కానుంది. 

Also read: Gmail Feature: మెయిల్ ఒకరికి బదులు మరొకరికి పంపిస్తే డిలీట్ ఆప్షన్ ఉందా, ఎలా చేసుకోవచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News