20వేల పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు ఆమోదం

20వేల పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు ఆమోదం

Last Updated : Sep 18, 2018, 04:06 PM IST
20వేల పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు ఆమోదం

ఏపీలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 20వేలకు పైగా పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, విద్యా, పోలీస్ శాఖలతో సహా వివిధ శాఖల్లోని 20,010 ఖాళీల భర్తీ చేసేందుకు చంద్రబాబు ఆమోదముద్ర వేశారు. ఏపీపీఎస్సీ, డీఎస్సీ, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో ఖాళీలను భర్తీ చేయనుండగా.. త్వరలోనే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుంది.

ఇప్పటికే రాష్ట్రంలో పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. వీటికి ఈ 20 వేల ఉద్యోగాలు అదనం. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 4.83 లక్షల పోస్టుల్లో 77,737 ఖాళీగా ఉన్నాయి. ఇందులో అత్యధికం డ్రైవర్లు, టైపిస్ట్‌-కం-అసిస్టెంట్‌ పోస్టులే అధికంగా ఉన్నాయి. అయితే అవసరానికి తగ్గట్లుగానే నియామకాలు జరపాలని ప్రభుత్వం భావించింది. అందువల్ల ముందుగా 20 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్ణయించింది.
 

వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు:

  • గ్రూప్-1 : 150 ఖాళీలు 
  • గ్రూప్-2 : 250  ఖాళీలు
  • గ్రూప్-3 : 1,670  ఖాళీలు
  • డీఎస్సీ ద్వారా : 9,275  ఖాళీలు
  • పోలీస్ శాఖ : 3,000 ఖాళీలు
  • వైద్య శాఖ : 1,604  ఖాళీలు
  • ఇతర శాఖలు : 1,636 ఖాళీలు

Trending News