Amaravati Farmers End: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్లీ రాజధాని వచ్చేసింది. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడడం.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎన్నికవడంతో ఆయన ప్రకటించిన అమరావతి రాజధాని మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామంటూ చంద్రబాబు ప్రకటించడంతో ఆ ప్రాంత రైతులు చేపట్టిన సుదీర్ఘ ఉద్యమానికి ముగింపు పడింది. 1631 రోజుల పాటు సాగిన అమరావతి రైతుల ఉద్యమం చంద్రబాబు ప్రమాణంతో ముగిసిపోయింది. ఈ మేరకు రాజధాని ప్రాంతంలో తమ దీక్ష శిబిరాలను రైతులు ఎత్తివేశారు.
Also Read: Nara Lokesh: 'అంతఃకరణ శుద్ధి' పలకలేని నారా లోకేశ్.. నిప్పు అనుకుంటే మళ్లీ పప్పేనా?
అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు వెల్లడించిన నాటి నుంచి రాజధాని ప్రాంత రైతులు ఆందోళనలు చేపట్టారు. వెలగపూడి గ్రామంలో మొట్టమొదటి రైతు దీక్షా శిబిరం ఏర్పాటైంది. నాటి నుంచి నేటి వరకు అక్కడ రోజూ నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. తీరొక్క రీతిలో రైతులు ఉద్యమాన్ని కొనసాగించారు. మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అనే నినాదంతో రైతులు అకుంఠిత దీక్షతో ఉద్యమాన్ని నడిపారు. అంతేకాకుండా న్యాయస్థానాల్లోనూ పోరాటం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు.
Also read: Pawan Chiranjeevi: సభపై భావోద్వేగానికి లోనైన పవన్ కల్యాణ్.. చిరంజీవికి పాదాభివందనం
అమరావతి రాజధానికి పునాది వేసిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో అమరావతి రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. సీఎంగా చంద్రబాబు రావడంతో అమరావతికి పూర్వ వైభవం వస్తుందనే భావనతో రైతులు దీక్షా శిబిరాలను తొలగించారు. 1631 రోజులుగా కొనసాగిన ఉద్యమాన్ని విరమిస్తున్నట్లు రైతు ఉద్యమకారులు ప్రకటించారు. వెలగపూడిలో దీక్ష శిబిరాలు ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. ఉద్యమంలో వెన్నుదన్నుగా నిలిచిన మీడియాకు, రాజకీయ నాయకులకు, పౌర సంఘాలకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
వివాదం ఇక్కడ
తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడడంతో విభజనకు గురయిన ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకపోవడంతో నాడు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించాడు. అయితే ఐదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ అమరావతిని నిర్వీర్యం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మూడు రాజధానుల పేరిట కొత్త అంశం తెరపైకి తీసుకొచ్చారు. అయితే ఆ మూడు రాజధానుల ప్రక్రియ కూడా కార్యరూపం దాల్చలేదు. దీంతో ఐదేళ్లపాటు రాజధాని లేని ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి అభాసుపాలైంది. తమ రాజధానిని కొనసాగించాలని కోరుతూ అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చేపట్టారు. సుదీర్ఘంగా సాగిన ఈ ఉద్యమం మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో ముగిసిపోయింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter