KTR Formula E Car Race: ఫార్ములా-ఈ రేస్‌కు సంబంధించి హైకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. కేటీఆర్ తరుపున సిద్దార్ధ్ దవే వాదనలు వినిపించారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ విచారణ జరుపుతోంది. ఇక మాజీ మంత్రి కేటీఆర్ చేసిన క్వాష్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసిన ఏపీబీ డీఎస్పీ. కేటీఆర్ పై ఉన్న నాట్ టూ అరెస్ట్ ఎత్తివేయాలని కోరింది ఏసీపీ. ఇక కేటీఆర్ తరుపున సిద్ధార్ధ్ దవే గట్టిగానే వాదనలు వినిపించారు. ఇందులో డబ్బులుచేరిన సంస్థను నిందితుడిగా చేర్చలేదు. ఈ నేపథ్యంలో ఇందులో ఇన్వాల్వ అయిన విదేశీ సంస్థ పేరు ఏంటని ప్రశ్నించిన హైకోర్టు.
FEO వివరాలను కోర్టుకు తెలిపిన కల్వకుంట్ల తారకరామారావు తరుపు న్యాయవాది సిద్ధార్ధ్ దవే. ఈ సందర్భంగా విచారణ కొనసాగే క్రమంలో కేటీఆర్ ను నిందితుడిగా చేర్చవచ్చు కదా అని ప్రశ్నించారు. 13(1)(a) సెక్షన్ అసలు వర్తించదని వాదించారు. ఈ మనీ ద్వారా లబ్ధి పొందింది కేటీఆర్ కాదన్నారు.
ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నప్పుడు పాలసీ నిర్ణయాలు తీసుకోకూడదు. కానీ ఇక్కడ ముందుగానే ఉన్న అగ్రిమెంట్ ఇంప్లిమెంట్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా కేటీఆర్ పై 5 ఆరోపణలు చేశారు. పర్మిషన్ లేకుండా విదేశీ కరెన్సీ ను ఫారెన్ సంస్థకు పంపారు. అగ్రిమెంట్ లేకుండానే చెల్లింపులు చేశారనే విషయాన్ని జడ్జి ప్రస్తావించారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడే చెల్లింపులు చేశారు.FEO నుండి డిసెంబర్ 20, 2023 రోజు మెయిల్ చేశారు. మిగతా డబ్బులు పే చేస్తే కానీ.. సీజన్ 10 నిర్వహిస్తామని చెప్పారు 26, డిసెంబర్ 2023 నాడు ప్రభుత్వం రిప్లై ఇచ్చింది.
FEO కు రెండు విడుతల్లో చెల్లించిన డబ్బులు ద్వారా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయని రిప్లై ఇచ్చారు. నిధులు చేరిన FEO ను మాత్రం నిందితుల జాబితాలో చేర్చలేదనే విషయాన్ని ప్రస్తావించారు. ఇక్కడ దర్డ్ పార్టీ లబ్ధి పొందింది అని చెప్తున్నారు కానీ థర్డ్ పార్టీ ఎవరో FIR లో ఎక్కడ చేర్చలేదు. డిసెంబర్ 18 సాయంత్రం 5:30కి కంపిటేoట్ అథారిటీ నుండి ఏసీబీ కి అనుమతి వచ్చింది.
డిసెంబర్ 19న ఏసీబీ FIR నమోదు చేసింది.ప్రభుత్వ నిధులు దుర్వినియోగం ఆయాయి ఆన్నది అవాస్తవం.
అప్పటి మున్సిపల్ మంత్రిగా నా ముందు పెట్టిన ఫైల్ పై సoతకం చేసినందుకు నిందితుడుగా చేర్చారన్నారు. అరవింద్ కుమార్ ఫైల్ పెట్టారు, కేటీఆర్ ఫైల్ పై సంతకం చేశారు. అంత మాత్రాన నిందితుడిగా చేరుస్తారా అని కేటీఆర్ తరుపు న్యాయవాది ప్రశ్నించారు.
ఈ మొత్తం వ్యవహారం లో కేటీఆర్ కు లబ్ధి చేకూరలేదు. అగ్రిమెంట్ చేసుకుంటే తప్పు ఎలా అవుతుందన్నారు.
విదేశీ సంస్థ తో అగ్రిమెంట్ చేసుకోవద్దు అని నిభందన ఉందా అని ప్రశ్నించారు. అలా నిబంధన ఉంటే కేటీఆర్ తప్పు చేసినట్టు.. కానీ ఇక్కడ అగ్రిమెంట్ చేసుకుంటే తప్పు ఎలా అవుతుంది - కేటీఆర్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. హైకోర్టు ఇప్పటికే ఈ కేసుపై విచారణ చేపట్టినప్పటికీ, తుది తీర్పు కోసం నేడు కీలకంగా మారింది. ఈ తీర్పు కేటీఆర్ రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేసే అవకాశాలున్నాయి.
*
కేటీఆర్‌పై నమోదైన కేసు సరైన ఆధారాలు లేవని ఆయన తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారని సమాచారం. మరోవైపు, ఈ కేసులో నిష్పక్షపాత విచారణ జరపాల్సిందిగా అధికార పార్టీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. కేసు కొట్టివేయడంపై కోర్టు ఏమి నిర్ణయిస్తుందన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చే తీర్పు కేటీఆర్ అరెస్ట్‌పై ప్రభావం చూపవచ్చు.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.