Hybrid Corona: కరోనా వైరస్ ఇప్పట్లో ప్రపంచాన్ని వదలదా..ఓ వేవ్ తరువాత మరో వేవ్..ఒక వేరియంట్ తరువాత మరో వేరియంట్. వెంటాడుతున్నాయి. ఇప్పుడు అన్ని వేరియంట్లకు మించి ప్రమాదకరమైన హైబ్రిడ్ కరోనా విస్తరిస్తోంది. ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. తస్మాత్ జాగ్రత్త.
కరోనా మహమ్మారి (Corona pandemic) ప్రపంచాన్ని గజగజలాడిస్తూనే ఉంది. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క వేరియంట్. కరోనా వైరస్ సెకండ్ వేవ్‌తో భారతదేశం అతలాకుతలమవుతోంది. వైరస్ అనేది ఎప్పటికప్పుడు రూపు మార్చుకుంటూనే ఉంటుంది. మొదట వచ్చిన వైరస్‌తో పోల్చితే తరువాత వచ్చిన వైరస్ హాని కల్గించడంలో చాలా ప్రమాదకరం. ఇలా రూపు మార్చుకున్న రెండు ప్రమాదకర వేరియంట్ల నుంచి అత్యంత ప్రమాదకర హైబ్రిడ్ అంటే సంకర జాతి వేరియంట్ పుట్టుకొచ్చింది. వియత్నాంలో ఈ హైబ్రిడ్ కరోనాను( Hybrid Corona)కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఇండియా, బ్రిటన్లలో విపత్తు సృష్టించిన కరోనా మ్యూటెంట్ల లక్షణాలతో కొత్త హైబ్రిడ్ వేరియంట్ వెలుగుచూసినట్టు వియత్నాం హెల్త్ మినిష్టర్ న్యూయెన్ థాన్ తెలిపారు.
ప్రస్తుతం వియత్నాం (Vietnam) దేశంలో సెకండ్ వేవ్(Corona Second Wave) గడగడలాడిస్తోంది. దేశంలోని 63 నగరాల్లో 31 నగరాలు కరోనా కోరల్లో చిక్కుకున్నాయి. ఈ రోగుల్నించి తీసుకున్న శాంపిల్స్ పరిశీలించినప్పుడు ఇండియా, బ్రిటన్లలో వెలుగు చూసిన కరోనా వేరియంట్ లక్షణాలతో కొత్తగా హైబ్రిడ్ వైరస్ పుట్టుకొచ్చినట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. గత వేరియంట్‌తో పోలిస్తే అమితమైన వేగంతో విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండియా, బ్రిటన్లలో వెలుగు చూసిన కరోనా వేరియంట్ల కంటే ఇదే ఎక్కువగా ప్రాణాలకు ముప్పు తెస్తోందని హెచ్చరించారు. త్వరలోనే ఈ వేరియంట్ సమాచారాన్ని ప్రపంచానికి తెలియజేస్తామన్నారు. ఇప్పటికే వియత్నాంలో ఏడు రకాల వేరియంట్లను కనుగొన్నారు. అన్నింటినీ ఇక్కడి ప్రభుత్వం నియంత్రించింది కానీ..హైబ్రిడ్ కరోనా మ్యూటెంట్‌ను నియంత్రించడం కష్టంగా మారింది.
Also read: Johnson and Johnson Vaccine: జాన్సన్ సింగిల్ డోసు వ్యాక్సిన్‌కు యూకే అనుమతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook