US Covid cases : అమెరికాలో 6 కోట్ల కోవిడ్‌ కేసులు, థర్డ్‌ వేవ్‌తో విలవిల

US Covid cases tally crosses 60 million : అమెరికాలో కోవిడ్ విజృంభన, యూఎస్‌లో 6 కోట్ల కరోనా కేసులు. కోవిడ్ థర్డ్‌ వేవ్‌తో అగ్రరాజ్యం విలవిలలాడుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2022, 12:34 AM IST
  • అమెరికాలో కోవిడ్ విజృంభన
  • యూఎస్‌లో 6 కోట్ల కరోనా కేసులు
  • కోవిడ్ థర్డ్‌ వేవ్‌తో అగ్రరాజ్యం విలవిల
  • రోజూ లక్షలాది మంది కోవిడ్ కేసులు
US Covid cases : అమెరికాలో 6 కోట్ల కోవిడ్‌ కేసులు, థర్డ్‌ వేవ్‌తో విలవిల

US shatters global record Covid cases tally crosses 60 million : అమెరికాను కోవిడ్ హడలెత్తిస్తోంది. ప్రపంచం మొత్తం మీద ముప్పై కోట్ల కరోనా కేసులు నమోదైతే, అందులో 6 కోట్ల కేసులు యూఎస్‌లోనే నమోదయ్యాయి. కోవిడ్ థర్డ్‌ వేవ్‌ అగ్రరాజ్యాన్ని ఆందోళనపరుస్తోంది. అమెరికాలో (America) రోజూ లక్షలాది మంది కోవిడ్ బారినపడుతున్నారు.

యూఎస్‌లో డెల్టా వేరియంట్‌తో (Delta variant‌) పాటు ఒమిక్రాన్ (Omicron) కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. గత వారం రోజుల సగటును ఒకసారి చూస్తే.. అక్కడ ప్రతి సెకన్‌కు 9 కోవిడ్ పాజిటివ్ (Covid positive) కేసులు వెలుగులోకివ వస్తున్నాయి.

యూఎస్‌లో ఫస్ట్‌ వేవ్‌ సందర్భంలో కూడా రోజూ వేలాది మంది కోరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు కూడా రోజూ లక్షల్లో కేసులు వచ్చాయి. ఇక ప్రస్తుతం థర్డ్‌వేవ్‌లో (Thirdwave) కూడా ఫస్ట్ వేవ్ కంటే ఎక్కువ కేసులే నమోదు అవుతున్నాయి.

ఇక ఇప్పటి వరకు యూఎస్‌లో నమోదైన కోవిడ్ కేసులు (Covid cases) మొత్తం 60 మిలియన్లకు చేరాయి. అంటే 6 కోట్ల మంది యూఎస్‌లో కోవిడ్ (Covid) బారినపడ్డారు. ఇక ప్రపంచంలోనే అత్యధికంగా కోవిడ్ కేసులు నమోదైన దేశంగా అమెరికా ఉంది. ఆ తర్వాత 3 కోట్లపైగా కేసులతో భారత్‌ (India) రెండో స్థానంలో నిలిచింది.

గతేడాది జనవరి 1 నాటికి అమెరికాలో కోవిడ్ పాజిటివ్‌ కేసులు (Covid positive‌ cases) 20 మిలియన్లు దాటాయి. అయితే ఆ సంఖ్య గతేడాది డిసెంబర్‌ 13 నాటికల్లా 50 మిలియన్లకు చేరింది.

Also Read : Krithi Shetty Photos: అందమైన కుందనాల బొమ్మ.. ఈ కన్నడ ముద్దుగుమ్మ

యూఎస్‌లోని కాలిఫోర్నియాలో గతేడాది డిసెంబర్‌ 1న కోవిడ్ కొత్త వేరియెంట్ ఒమిక్రాన్‌ వెలుగులోకి వచ్చింది. తర్వాత ఒమిక్రాన్ కేసులు (Omicron cases) భారీగా నమోదు అయ్యాయి. ఇప్పటికీ రోజూ వేలాది సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఇక కోవిడ్‌ వల్ల అగ్రరాజ్యంలో చాలా మంది ప్రాణాలు కోల్పొతున్నారు. జనవరి 2020 నుంచి ఇప్పటి వరకు సుమారు 8 లక్షల మంది అమెరికాలో కోవిడ్‌ (Covid‌) బారిన పడి చనిపోయారు.

Also Read : Maharashtra Corona Cases: మహారాష్ట్రలో పెరిగిన కరోనా కేసులు.. 46,723 కొత్త కేసులు, 32 మరణాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News