Covid-19: సింగపూర్‌లో భారీగా పెరుగుతున్న కొవిడ్ కేసులు... ప్రయాణికులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ..

Covid cases Rise: సింగపూర్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నారు. గత వారంతో పోలిస్తే 75శాతం కేసులు అధికమయ్యాయి. వైరస్ ఇన్పెక్షన్స్ నేపథ్యంలో ఆ దేశ పౌరులకు, టూరిస్టులకు ట్రావెల్ అడ్వయిజరీ జారీ చేసింది సింగపూర్ సర్కారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2023, 09:25 PM IST
Covid-19: సింగపూర్‌లో భారీగా పెరుగుతున్న కొవిడ్ కేసులు... ప్రయాణికులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ..

Singapore Covid cases: సింగపూర్‌లో కొవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొన్ని రోజులగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. డిసెంబర్ 3 నుండి 9వ తేదీ వరకు గల వారంలో కోవిడ్ కేసులు సంఖ్య 56,043కి పెరిగింది. అంతకముందు వారం కరోనా కేసుల సంఖ్య 32,035గా ఉంది. వారంలోనే 20వేలకుపైగా కేసులు పెరిగాయి. సగటు రోజువారీ కోవిడ్ ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య వారం ముందు 225 నుండి 350కి పెరిగింది. 

ఈ క్రమంలో సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వశాఖ దేశ పౌరులతోపాటు వివిధ దేశాల నుంచి అక్కడికి వచ్చే టూరిస్టులకు కూడా ట్రావెల్ అడ్వయిజరీ జారీ చేసింది. రద్దీ ప్రాంతాలలో ముఖానికి మాస్క్‌ ధరించాలని సూచించింది. దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఇంటి వద్దనే ఉండాలనీ పేర్కొంది. ప్రయాణికులు విమానాశ్రయాలలో తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని.. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లొద్దని చెప్పింది. అంతేకుండా ట్రావెల్ చేసేవారు ఆరోగ్య బీమా తీసుకోవాలని సింగపూర్ ప్రభుత్వం కోరింది. 

దేశంలో కొత్త కేసులు గత వారం కంటే 75 శాతం పెరిగిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సింగపూర్ సర్కారు సూచించింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వృద్ధులు ప్లూ టీకాలు, కొవిడ్ బూస్టర్ డోసులు తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం ఆ దేశంలో BA.2.86 – JN.1 సబ్ వేరియంటే కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. 

Also Read: Libyan Boat Accident: సముద్రంలో వలసదారుల పడవ బోల్తా.. 60 మందికిపైగా మృతి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News