Bajaj Pulsar N125 Price: ఎప్పటి నుంచో అతి తక్కువ ధరలోనే అద్భుతమైన స్పోర్ట్స్ బైక్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? బజాజ్ ఇటీవలే మార్కెట్లోకి తీసుకు వచ్చిన ఓ మోటార్‌సైకిల్ అతి తక్కువ ధరలో లభిస్తోంది. ఇది అనేక రకాల శక్తివంతమైన ఫీచర్స్‌తో లభిస్తోంది. ఇంతకీ ఈ బైక్ ఏంటో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన బజాజ్ పల్సర్ N125 బైక్ ప్రత్యేకమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది చూడడానికి అచ్చం స్పోర్ట్స్ బైక్ లాగే కనిపిస్తుంది. దీనిని కంపెనీ స్పోర్ట్స్ మోటర్ సైకిల్‌ను దృష్టిలో పెట్టుకునే విడుదల చేసినట్లు ప్రకటించింది.
బజాజ్ పల్సర్ N125 మోటర్ సైకిల్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే..ఈ బైక్‌లో స్పీడోమీటర్‌తో పాటు ఆటో మీటర్, ట్రిప్ మీటర్ వంటి ప్రత్యేకమైన కొత్త టెక్నాలజీతో విడుదలైంది. అలాగే ఈ మోటర్ సైకిల్లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్స్ కూడా లభిస్తున్నాయి.
బజాజ్ పల్సర్ N125 మోటార్‌సైకిల్‌లో డబుల్ డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. అలాగే మొబైల్‌ను ఛార్జ్ చేసేందుకు ఈ బైక్‌లో ప్రత్యేకమైన ఛార్జింగ్ పోర్ట్ ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ప్రత్యేకమైన కంట్రోల్ ఫీచర్స్ కూడా లభిస్తున్నాయి.
ఈ బజాజ్ పల్సర్ N125 మోటర్ సైకిల్ 124.53 cc ఇంజన్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది సింగిల్-ఛానల్ ABSతో వస్తోంది. ఇక ఈ బైక్‌కి సంబంధించిన మైలేజీ వివరాల్లోకి వెళితే.. ఇది లీటర్‌కి దాదాపు 59 కిమీ మైలేజీని అందిస్తుంది.
ఈ మోటర్ సైకిల్ ప్రత్యేకమైన కొత్త గేర్‌బాక్స్ సెటప్‌తో విడుదలైంది. ఇక ఈ బైక్‌కి సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. రూ.1.12 లక్షల నుంచి ప్రారంభం కాబోతోంది. అయితే దీనిపై ప్రత్యేకమైన డిస్కౌంట్ అందుబాటులో ఉన్నాయి.