Sheikh Hasina Resign As PM: రిజర్వేషన్ల అంశం బంగ్లాదేశ్‌ను ఊపేస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అల్లర్లు చోటుచేసుకోవడంతో ఆ దేశం హింసాత్మక సంఘటనలతో అల్లాడుతోంది. దాదాపు 300 మంది చనిపోవడంతో అక్కడి షేక్ హసీనా పాలనపై ఆగ్రహంతో తీవ్రస్థాయిలో ఉద్యమం నడుస్తోంది. ఇప్పటికే ఆ దేశంలో పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులు, సైన్యం రంగంలోకి దిగినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ప్రధానమంత్రి షేక్ హసీనా దేశాన్ని వీడారు. ప్రత్యేక విమానంలో ఆమె భారతదేశానికి చేరుకున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె ప్రధానమంత్రి పదవికి రాజీనామా కూడా చేసినట్లు సమాచారం.
Also Read: Bangladesh Protests Live Updates: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల చిచ్చు.. దేశం వీడిన ప్రధాని షేక్ హసీనా
బంగ్లాదేశ్‌లో ఆదివారం మరింత హింసాత్మక పరిస్థితి ఏర్పడింది. ఆ ఘర్షణల్లో దాదాపు 100 మందికి పైగా మృతి చెందారు. ఈ ఆందోళనలతో పరిస్థితి అదుపు తప్పిందని నిర్ధారించుకున్న ప్రధానమంత్రి హసీనా ఇప్పటికే దేశ రాజధాని ఢాకాను వీడారు. ప్రధానమంత్రి అధికారిక నివాసం గణబంధన్ వీడి ఆమె భారతదేశం వచ్చారని తెలుస్తోంది. భారతదేశం సురక్షిత ప్రాంతంగా ఆమె భారత్‌లోకి అడుగుపెట్టినట్లు సమాచారం.
సైనిక హెలికాప్టర్‌లో షేక్ హసీనా తన సోదరితో కలిసి భారతదేశం వచ్చారని అక్కడి జాతీయ మీడియా చెబుతోంది. అయితే బంగ్లాదేశ్ పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్‌కు వచ్చారని అయితే అక్కడ కూడా సురక్షితం కాదని భావించినట్లు వార్తలు వస్తున్నాయి. అక్కడి నుంచి నేరుగా న్యూఢిల్లీ చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశం బంగ్లాదేశ్‌లో తీవ్ర దుమారం రేపింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ యువత పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టింది. రిజర్వేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారు.
సైనిక పాలన
దేశంలో పరిస్థితి అదుపు తప్పడంతో సైనిక పాలన అమల్లోకి వచ్చినట్లు సమాచారం. కొన్ని నెలల కిందట హింసాత్మక పరిణామాల మధ్యనే ఆ దేశ ఎన్నికలు జరగ్గా షేక్ హసీనా మరోసారి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు రిజర్వేషన్ల అంశం తీవ్రరూపం దాల్చడం.. దేశం ప్రమాదంలో పడడంతో బంగ్లాదేశ్‌లో సైనిక పాలన అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆ దేశ సైన్య అధ్యక్షుడు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి