Saudi Arabia has decided to ban the Tablighi Jamaat: సున్నీ ముస్లీం విధానాన్ని ప్రోత్సహించే 'తబ్లిగీ జమాత్'పై నిషేధం విధించింది సౌదీ అరేబియా. ఈ విషయాన్ని ఆ దేశ ఇస్లామిక్ వ్యవహారాల మంత్రి డాక్టర్ అబ్దుల్లతీఫ్ అల్ అల్షేక్ సామాజిక మాధ్యమాల ద్వారా అధికారికంగా ప్రకటించారు.
ఈ సంస్థ వల్ల సమాజానికి ముప్పు (Tablighi Jamaat poses to society.) ఉందని, ఉగ్రవాదానికి ఇది ఓ ద్వారమని అభిప్రాయపడింది (Ban on Tablighi Jamaat) సౌదీ అరేబియా.
ఈ విషయంపై ప్రజలను హెచ్చరించేందుకు శుక్రవారం తాత్కాలిక మసీదులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు డాక్టర్ అబ్దుల్లతీఫ్ అల్ అల్షేక్. వచ్చే శుక్రవారం దీనిపై ప్రసంగించనున్నట్లు పేర్కొన్నారు.
దీనితో పాటు తబ్లిగీ జమాత్ వల్ల ఉన్న ప్రమాదం గురించి చెప్పాలని మసీదుల నిర్వహకులకు సూచించింది సౌదీ. ప్రసంగాల్లో ఆ సంస్థ తప్పులను గురించి వివరించాలని తెలిపింది.
ఏమిటి ఈ తబ్లిగీ జమాత్..
సున్నీ ముస్లీం విధానాన్ని ప్రోత్సహించడం కోసం ఏర్పడిందే ఈ తబ్లిగీ జమాత్. 1926లో దీనిని మౌలాన మహ్మద్ ఇలియాస్ స్థాపించారు.
100 దేశాలకు పైగా తబ్లిగీ జమాత్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ సంస్థకు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియా వంటి దేశాలు ప్రధాన కేంద్రాలు.
అయితే తబ్లిగీ జమాత్‌కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని గత కొంత కాలంగా చర్చ సాగుతూనే ఉంది. తాజాగా దీనిపై సౌదీ అరేబియా బహిరంగంగా ప్రకటన చేయడం గమనార్హం.
Also read: Faisalabad Incident Video: పాకిస్తాన్ లో వివస్త్రలను చేసి నలుగురు మహిళలపై దాడి.. వార్తల్లో నిజమెంత?
Also read: Facebook Donation: పరిశోధనలకై మార్క్ జుకర్‌బర్గ్ భారీ విరాళం, ఏకంగా 2 లక్షల 50 వేల కోట్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook