Russia Ukraine War: ఉక్రెయిన్‌లో రష్యా చర్యలపై UN భద్రతా మండలిలో ఓటింగ్‌.. భారత్, చైనా దూరం..

Russia Ukraine War: ఉక్రెయిన్‌లో రష్యా దూకుడును ఖండిస్తూ చేపట్టిన ఐక్యరాజ్యసమితి ఓటింగ్‌కు భారత్ దూరమైంది. రష్యా తన వీటో పవర్ తో తీర్మానాన్ని అడ్డుకుంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 26, 2022, 08:23 AM IST
Russia Ukraine War: ఉక్రెయిన్‌లో రష్యా చర్యలపై UN భద్రతా మండలిలో ఓటింగ్‌.. భారత్, చైనా దూరం..

Russia Vetoes UN Security Action On Ukraine: రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ( UN Security Council) ముసాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిని  రష్యా (Russia) వీటో చేసింది. కౌన్సిల్ 15 సభ్యదేశాల్లో 11 దేశాలు రష్యాకు వ్యతిరేఖంగా ఓటును వేశాయి. భారత్‌ (India), చైనా, యూఏఈలు ఈ ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. అమెరికా..అల్బేనియాతో కలిసి ఈ ముసాయిదా తీర్మానాన్ని రూపొందించింది. మరోవైపు 193 సభ్యదేశాలు ఉన్న ఐరాస జనరల్‌ అసెంబ్లీలో ఈ ముసాయిదాను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. 

''‘మీరు ఈ తీర్మానాన్ని వీటో చేయవచ్చు. కానీ మా గొంతులను మీరు వీటో చేయలేరు. మీరు సత్యాన్ని,  మా విలువలను వీటో చేయలేరు. మీరు ఉక్రెయిన్‌ ప్రజలను వీటో చేయలేరు'' అంటూ’ రష్యాను ఉద్దేశించి కామెంట్స్ చేశారు యూఎన్ లోని యూఎస్‌ రాయబారి లిండా థామస్‌ గ్రీన్‌ఫీల్డ్‌ (Linda Thomas). 

అంతకముందు రష్యా బలగాలు దాడులు నేపథ్యంలో..అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో చర్చలు జరిపారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Volodymyr zelensky). ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన అమెరికాకు థ్యాంక్స్ చెప్పారు. ఉక్రెయిన్‌ను రష్యా ఆక్రమించకుండా ఉండేందుకు రక్షణ సహాయం, ఆ దేశంపై కఠిన ఆంక్షలు, యుద్ధ వ్యతిరేఖ కూటమిపై జోబైడెన్‌తో చర్చించినట్లు జెలెన్‌స్కీ వెల్లడించారు. 

Also Read: Russia-Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం- ఒంటరయ్యామన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News