కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం ప్రపోజల్ రెడీ చేశాం: పాకిస్తాన్

పాకిస్తాన్ మానవ హక్కుల మంత్రిత్వ శాఖ మంత్రి షిరీన్ మజారీ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ప్రధాన సమస్యగా పరిగణిస్తున్న వంటి కాశ్మీర్ వివాదానికి ఒక పరిష్కారం ఉండాలనే తాము కోరుకుంటున్నామని తెలిపారు.

Last Updated : Aug 29, 2018, 09:39 PM IST
కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం ప్రపోజల్ రెడీ చేశాం: పాకిస్తాన్

పాకిస్తాన్ మానవ హక్కుల మంత్రిత్వ శాఖ మంత్రి షిరీన్ మజారీ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ప్రధాన సమస్యగా పరిగణిస్తున్న వంటి కాశ్మీర్ వివాదానికి ఒక పరిష్కారం ఉండాలనే తాము కోరుకుంటున్నామని తెలిపారు. ఈ క్రమంలో ఈ సమస్యకు ఎలాంటి ముగింపు పలికితే బాగుంటుందనే విషయంపై చర్చలు జరిపి ఒక ప్రపోజల్ తయారుచేశామని.. ఆ ప్రపోజల్ ప్రకారమే త్వరలో పాకిస్తాన్ ప్రభుత్వం చర్చలకు ప్రయత్నిస్తుందని తెలిపారు.

ఈ ప్రపోజల్‌ను తొలుత తమ క్యాబినెట్ ఆమోదం కోసం పార్లమెంటులో కూడా ప్రవేశపెడతామని ఆమె తెలిపారు. ప్రస్తుతం పాకిస్తాన్ మంత్రిగా ఉన్న షిరీన్ మజారీ గతంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్‌కు డైరెక్టర్ జనరల్‌గా కూడా వ్యవహరించారు. ఈ విషయాన్ని పక్కన పెడితే.. త్వరలోనే భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, పాక్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీని కలవనున్నారు. వచ్చే నెలలో జరగబోయే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఖురేషీతో సుష్మా స్వరాజ్ భేటీ కానున్నారు. 

ఇటీవలే పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇమ్రాన్ ఖాన్ కూడా కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం తాను భారత ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించడానికి సిద్ధమేనని తెలిపిన సంగతి తెలిసిందే. భారత్ ఈ విషయంలో ఒక్క అడుగు ముందుకు వేస్తే.. తాము రెండు అడుగులు ముందుకు వేయాలని అనుకుంటున్నామని ఆయన తెలిపారు. అయితే తనను ఇండియన్ మీడియా బాలీవుడ్ విలన్‌గా ప్రొజెక్ట్ చేయడం నచ్చడం లేదని ఇమ్రాన్ తెలిపారు. 

Trending News