Fuel Price: సామాన్య ప్రజలకు శుభవార్త.. పెట్రోల్‌పై రూ.15, డీజిల్‌పై రూ.7 తగ్గింపు!

Pakistan govt reduces petrol and diesel prices. పెట్రోల్ ధరపై లీటరుకు 18.5 పాకిస్థాన్ రూపాయిలను తగ్గిస్తూ పాకిస్థాన్‌ సర్కార్‌ తాజాగా నిర్ణయం తీసుకుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 16, 2022, 01:31 PM IST
  • సామాన్య ప్రజలకు శుభవార్త
  • పెట్రోల్‌పై రూ.15, డీజిల్‌పై రూ.7 తగ్గింపు
  • 3 నెలల కాలంలో నాలుగు సార్లు
Fuel Price: సామాన్య ప్రజలకు శుభవార్త.. పెట్రోల్‌పై రూ.15, డీజిల్‌పై రూ.7 తగ్గింపు!

Pakistan govt reduces petrol and diesel prices: దేశం ఏదైనా గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే. శ్రీలంక పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ దశలో లీటర్ రూ. 500 లకు కూడా వెళ్ళింది. భారత దేశంలో చమురు ధరలు ఆల్‌టైం హై చేరుకున్నాయి. ఇప్పటికీ లీటర్‌ పెట్రోల్‌ ధర దాదాపుగా రూ. 110గా ఉంది. ఇక దాయాది దేశం పాకిస్థాన్‌లో కూడా ఈ నెల ఆరంభంలో పెట్రో ధరల మోత మోగింది. ఇటీవల లీటరుపై రూ.14 నుంచి రూ.19 వరకు పెరిగాయి. అయితే పాకిస్థాన్‌ సర్కార్‌ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరను భారీగా తగ్గించింది.

పెట్రోల్ ధరపై లీటరుకు 18.5 పాకిస్థాన్ రూపాయిలను తగ్గిస్తూ పాకిస్థాన్‌ సర్కార్‌ తాజాగా నిర్ణయం తీసుకుంది. అంటే భారత్‌ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 7 తగ్గింది. మరోవైపు డీజిల్ ధర లీటరుకు 40 పాకిస్థాన్‌ రూపాయిలు తగ్గింది. భారత్‌ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 15 మేర తగ్గింది. పాక్ ప్రభుత్వం గత 3 నెలల కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలను నాలుగు సార్లు పెంచగా.. ఇప్పుడు కాస్త తగ్గించి సామాన్య ప్రజలకు ఊరట కలిగించింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్ల దిగువకు పడిపోయిన నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.. ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ గురువారం పెట్రోల్ ధరను పాక్ కరెన్సీలో లీటరుకు18.50 మరియు డీజిల్ ధరను లీటరుకు 40.54 చొప్పున తగ్గించారు. దాంతో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటరుకు 230.24కి తగ్గగా.. డీజిల్ లీటర్ 236 కి చేరుకుంది. ఈరోజు అర్ధరాత్రి నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. 

Also Read: Major: మేజర్ మూవీ అరుదైన రికార్డు.. శత్రుదేశం సహా 14 దేశాల్లో టాప్ మూవీగా!

Also Read: Laal Singh Chaddha: టాలీవుడ్ స్టార్స్ తో లాల్ సింగ్ చద్దా ప్రివ్యూ.. ఏడ్చేసిన అమీర్

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News