New Zealand Earthquake: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. తేరుకునేలోపే మళ్లీ ఇలా..!

New Zealand Earthquake Update: న్యూజిలాండ్‌ను వరుస విపత్తులు బెంబెలేత్తిస్తున్నాయి. వరదల నుంచి తేరుకునేలోపే వరుస భూకంపాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా   మరోసారి భారీ భూకంపం సంభవించింది. రికార్డు స్కేలుపై 6.9గా నమోదైంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 4, 2023, 04:55 PM IST
  • న్యూజిలాండ్‌లో మరోసారి భూకంపం
  • రికార్డు స్కేలుపై 6.9గా నమోదు
  • భయాందోళనకు గురిచేస్తున్న వరుస భూకంపాలు
New Zealand Earthquake: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. తేరుకునేలోపే మళ్లీ ఇలా..!

New Zealand Earthquake Update: టర్కీ, సిరియా దేశాల్లో విధ్వంసం సృష్టించిన భూకంపం.. ఇతర దేశాలను సైతం వణికిస్తోంది. తాజాగా భూకంపం ధాటికి న్యూజిలాండ్ భూభాగం దద్దరిల్లింది. న్యూజిలాండ్‌లో శనివారం భారీ భూకంపం సంభవించడంతో భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. కివీస్‌కు ఉత్తరాన ఉన్న పసిఫిక్ ప్రాంతంలో భూకంప కేంద్రం గుర్తించారు. సముద్రంలో భూమి కంపించడంర ప్రస్తుతానికి సునామీ ముప్పు గురించి ఇంకా ప్రకటన రాలేదు. అదేవిధంగా భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు. 

న్యూజిలాండ్‌లోని కెర్మాడెక్ ద్వీప ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (ఈఎమ్‌ఎస్‌సీ) ప్రకారం.. భూకంపం  తీవ్రత 6.6గా నమోదైంది. భూకంపం 183 కి.మీ లోతులో ఉంది. భూకంపం తర్వాత ఎలాంటి సునామీ హెచ్చరికలు లేవని అమెరికా సునామీ హెచ్చరికల వ్యవస్థ స్పష్టంచేసింది. 

గత నెల ప్రారంభంలో కూడా న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. ఫిబ్రవరి 15వ తేదీ మధ్యాహ్నం న్యూజిలాండ్‌లో 6.1 తీవ్రతతో భూమి కంపించింది. భూకంప కార్యకలాపాల గురించి సమాచారం ఇచ్చే ఏజెన్సీ ఈఎమ్‌ఎస్‌సీ న్యూజిలాండ్‌లోని లోయర్ హట్‌కు వాయువ్యంగా 78 కి.మీ దూరంలో భూకంప ప్రకంపనలు సంభవించాయని వెల్లడించింది. అయితే భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

గత నెలలో కివీస్‌లో గాబ్రియేల్ తుఫాను ప్రభావంతో భారీ నష్టంవాటిల్లిన విషయం తెలిసిందే. తుఫాను కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో వరదలు పోటెత్తాయి. అదేవిధంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈదురు గాలుల కారణంగా వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వందలాది విమానాలు కూడా రద్దయ్యాయి. పరిస్థితి మరీ దారుణంగా మారడంతో ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఇటీవలె తుఫాను నుంచి కోలుకున్న న్యూజిలాండ్ దేశాన్ని.. మళ్లీ భూకంపాలు భయపెడుతున్నాయి. 

ఇక మనదేశంలోనూ భూకంప ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఢిల్లీ, చెన్నై నగరాల్లో ఇటీవలె భూమి కంపించిన విషయం తెలిసిందే. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకపోయినా.. భవిష్యత్‌లో భారీ భూకంపాలు వస్తాయనే హెచ్చరికలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Also Read: Indore Pitch ICC: గబ్బా పిచ్‌కు ఎన్ని డీమెరిట్‌ పాయింట్లు ఇచ్చారు.. ఐసీసీపై ఫైర్ అయిన భారత క్రికెట్ దిగ్గజం!  

Also Read: Old Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. ఓపీఎస్‌పై కీలక ఉత్తర్వులు  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News