china landslide news: నైరుతి చైనాలోని గుయిజౌ ప్రావిన్స్‌లోని (Guizhou province) ఓ నిర్మాణ స్థలంలో కొండచరియలు విరిగిపడి 14 మంది మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉండే గుయిజౌ.. చైనాలోనే అత్యంత తక్కువగా అభివృద్ధి చెందిన ప్రదేశాల్లో ఒకటి. బిజీ నగరంలో (Bijie city) సోమవారం సాయంత్రం కొండచరియలు (Landslides) విరిగిపడిన సమయంలో కార్మికులు ఆసుపత్రి కోసం శిక్షణా కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రాత్రివేళ 1000మందికిపైగా ప్రజలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
చైనాలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. డిసెంబరులో షాంగ్సీ ప్రావిన్స్‌లో (Shanxi province) వరదలు (Floods) ముంచెత్తిడంతో... బొగ్గు గని కుప్పకూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో 20 మందిని అధికారులు రక్షించారు. జూలైలో దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో సొరంగం పనులు చేస్తున్న సమయంలో...వరదలు రావటంతో...14 మంది మరణించారు. 2015లో తయాన్జిన్లో (Tianjin) ఓ రసాయన గిడ్డంగిలో జరిగిన పేలుళ్ల ధాటికి 173 మంది ప్రాణాలు కోల్పోయారు.
Also read: China Fire Accident: అండర్‌గ్రౌండ్‌లో అగ్నిప్రమాదం... 9 మంది సజీవదహనం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
China Landslides: చైనాలో కొండచరియలు విరిగిపడి 14మంది మృతి!