US New President: నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: జో బిడెన్

అత్యంత ఉత్కంఠ రేపిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థి జోసెఫ్‌ రాబినెట్‌ బిడెన్‌ చివరికి విజయం సాధించారు. అమెరికన్లు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని జో బిడెన్ స్పష్టం చేశారు.

Last Updated : Nov 8, 2020, 01:47 PM IST
US New President: నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: జో బిడెన్

అత్యంత ఉత్కంఠ రేపిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో( America president Elections ) డెమోక్రటిక్‌ అభ్యర్థి జోసెఫ్‌ రాబినెట్‌ బిడెన్‌ చివరికి విజయం సాధించారు. అమెరికన్లు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని జో బిడెన్ ( Joe Biden ) స్పష్టం చేశారు.

అమెరికా  సంయుక్త రాష్ట్రాల 46వ అధ్యక్షుడి ( America 46th president ) గా శ్వేతసౌధంలో అడుగు పెట్టనున్నారు 77 ఏళ్ల జో బిడెన్. మరోవైపు  ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్న తొలిమహిళగా, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ రికార్డు సృష్టించనున్నారు. తొలి బహిరంగ సభలో మాట్లాడిన జో బిడెన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు.  తన గెలుపు అమెరికన్ల విజయమని జో బైడెన్ తెలిపారు. అమెరికన్ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని.. అమెరికా చరిత్రలో ఇదొక నూతన అధ్యాయమని బిడెన్ చెప్పారు.  7.4 కోట్ల మంది అమెరికన్లు డెమోక్రాట్లకు..తమ ఉజ్వల భవిష్యత్ కోసం ఓటేశారన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా పరిపాలన చేస్తానని.. ప్రత్యర్ధులు తమకు శత్రువులు కాదని..వారు కూడా అమెరికన్లేనని గుర్తు చేశారు. అమెరికాకు కొత్త రోజులు రాబోతున్నాయని.. కమలా హ్యారిస్ అద్భుత నాయకురాలని.. అమెరికాలో వర్ణవివక్ష లేకుండా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. Also read: US Presidents: అమెరికా అధ్యక్షుల గురించి ఆసక్తికర విషయాలు

నవంబర్ 3న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఉత్కంఠతకు నాలుగు రోజుల అనంతరం తెరపడింది. అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి జో బిడెన్ ( Joe Biden )  ఘన విజయం సాధించారు. అమెరికా అధికార పీఠానికి మొత్తం 530 ఎలక్టోరల్ ఓట్లలో కావల్సిన మ్యాజిక్ ఫిగర్ 270. రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald trump ) రెండోసారి పోటీ పడగా..డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిగా జో బిడెన్ బరిలో నిలిచారు. 

నాలుగు రోజుల వరకూ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. జో బిడెన్ 264 ఓట్లు, ట్రంప్ 214 ఓట్లు సాధించిన తరువాత ...మరో ఐదు రాష్ట్రాల్లో కౌంటింగ్ కొనసాగుతుండటంతో రెండు రోజుల నుంచి సస్పెన్స్ నెలకొంది. మొత్తానికి ఇప్పుడా సస్పెన్స్ తొలగిపోయింది. అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బిడెన్ ఎన్నికయ్యారు. 

అమెరికా మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైన భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారిస్ ( Kamala harris ) ఇదే సభలో మాట్లాడారు. అమెరికన్లు ప్రజాస్వామ్యాన్ని కాపాడారని చెప్పారు. అమెరికా చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభమైందని.. ఉపాధ్యక్ష ఎన్నికల్లో తన గెలుపు మహిళా లోకం సాధించిన  విజయంగా ఆమె అభివర్ణించారు. Also read: Joe Biden: అమెరికన్లందరికీ అధ్యక్షుడిగా ఉంటా: జో బిడెన్

Trending News