Iran: ప్రముఖ న్యూక్లియర్ శాస్త్రవేత్త దారుణ హత్య

Scientist Assassination: ఇరాన్ దేశపు ప్రసిద్ధ న్యూక్లియర్ శాస్త్రవేత్త దారుణహత్యకు గురయ్యారు. హత్య వెనుక ఇజ్రాయెల్ హస్తముందని ఇరాన్ ఆరోపించడం కలకలం రేపుతోంది.

Last Updated : Nov 28, 2020, 11:31 AM IST
Iran: ప్రముఖ న్యూక్లియర్ శాస్త్రవేత్త దారుణ హత్య

Scientist Assassination: ఇరాన్ దేశపు ప్రసిద్ధ న్యూక్లియర్ శాస్త్రవేత్త దారుణహత్యకు గురయ్యారు. హత్య వెనుక ఇజ్రాయెల్ హస్తముందని ఇరాన్ ఆరోపించడం కలకలం రేపుతోంది.

ఇరాన్-ఇజ్రాయెల్ ( Iran- izrael ) దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరాన్ దేశపు సుప్రసిద్ధ న్యూక్లియర్ శాస్త్రవేత్త మొహ్సేన్ ఫక్రీజాదే ( Mohsen Fakhrizadeh )  దారుణహత్యకు గురయ్యారు. ఇరాన్ రాజధాని నగరం టెహ్రాన్ ( Tehrain )‌ శివారులో తన వాహ‌నంలో వెళ్తున్న ఫ‌క్రిజాదేపై ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌రిపారు. తీవ్రంగా గాయ‌ప‌డ్డ ఫక్రీజాదే ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు. ఇరాన్ ర‌క్ష‌ణ‌శాఖ‌కు చెందిన రీసెర్చ్ అండ్ ఇన్నోవేష‌న్ ఆర్గ‌నైజేష‌న్ అధిప‌తిగా ఫ‌క్రిజాదే ప‌నిచేశారు. ఈ హత్య వెనుక ఇజ్రాయెల్‌  హస్తం ఉన్నట్లు ఇరాన్‌ ఆరోపించింది.

ఈ మేరకు ఇరాన్‌ విదేశాంగ మంత్రి మహ్మద్‌ జావేద్‌ జరీఫ్‌ ఐక్యరాజ్యసమితికి ఓ లేఖ రాశారు. టెహ్రాన్‌లో జరిగిన మొహ్సేన్ హత్య వెనుక ఇజ్రాయెల్‌ హస్తం ఉందని.. అయితే ఎలాంటి సాక్ష్యాదారాలు లేకుండా చేయడానికి ప్రయత్నిస్తోందని లేఖ ద్వారా ఆరోపించారు. అయితే ఇజ్రాయెల్ మాత్రం దీనిపై ఇంకా స్పందించలేదు. 

ఇరాన్ శాస్త్రవేత్త ఫక్రీజాదేను హత్య ( Iran scientist Assassinated ) వెనుక ఇజ్రాయెల్ నేరతత్వం, పిరికితనం స్పష్టంగా కన్పిస్తున్నాయని ఇరాన్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ డబుల్ గేమ్ ఆడుతోందని..దీనిని ఖండించాల్సిన అవసరముందని తెలిపింది. తమ శాస్త్రవేత్త హత్యకు ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటామని చెప్పింది. Also read: Donald trump: సింహం సింగిల్ గా వస్తుంది..దుమ్ము రేపుతున్న ట్రంప్ షేర్ చేసిన వీడియో

Trending News