Google Good News: ఉద్యోగులకు ఇకపై 4 డే వీక్

ఉద్యోగుల ప్రయోజనాలకు పెద్దపీట వేసే గూగుల్ మరో గుడ్ న్యూస్ అందిస్తోంది. అదనంగా మరో రోజు సెలవివ్వడానికి నిర్ణయించింది. కోవిడ్ 19 నేపధ్యంలో వర్క్ ఫ్రం హోంతో ఇబ్బంది పడుతున్న ఉద్యోగులకు ఊరటనిచ్చే వార్తే ఇది..

Last Updated : Sep 5, 2020, 06:41 PM IST
Google Good News: ఉద్యోగులకు ఇకపై 4 డే వీక్

ఉద్యోగుల ప్రయోజనాలకు పెద్దపీట వేసే గూగుల్ ( Google ) మరో గుడ్ న్యూస్ అందిస్తోంది. అదనంగా మరో రోజు సెలవివ్వడానికి నిర్ణయించింది. కోవిడ్ 19 ( covid 19 ) నేపధ్యంలో వర్క్ ఫ్రం హోంతో ఇబ్బంది పడుతున్న ఉద్యోగులకు ఊరటనిచ్చే వార్తే ఇది..

కోవిడ్ 19 వైరస్ ప్రారంభమై అప్పుడే 7 నెలలవుతోంది. చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం ( Work from home ) కొనసాగిస్తున్నాయి. ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది తన ఉద్యోగుల కోసం. వర్క్ ఫ్రం హోంతో ఇబ్బంది పడుతున్న ఉద్యోగులకు ఊరటనిచ్చే చర్యకు దిగింది. ఉద్యోగులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పని చేసేందుకు ఉద్యోగులకు అవకాశాలిస్తోంది. ఇందులో భాగంగా...వారంలో మరో రోజు అదనంగా సెలవిచ్చేందుకు నిర్ణయించింది ( One more day in week ) . అంటే ఇకపై శనివారం, ఆదివారాలతో పాటు శుక్రవారం కూడా ( Friday also a holiday ) సెలవు ఇస్తోంది. ఉద్యోగులతో పాటు ఇంటర్న్ లకు కూడా ఇది వర్తిస్తుందని గూగుల్ వెల్లడించింది. వీక్ ఆఫ్ గా మరో రోజు ప్రకటించింది. అంటే ఇప్పుడు  గూగుల్ ఉద్యోగులకు 5 డే వీక్ కాదన్న మాట. 4 డే వీక్ ( 4 day week ) . ఇక్కడ ఒకవేళ శుక్రవారం అత్యవసరంగా పనిచేయాల్సి వస్తే...మరో రోజు తీసుకోవచ్చు. ఈ డే ఆఫ్ ను ఉద్యోగులకు కల్పించడంలో మేనేజర్లు మద్దతుగా ఉండాలని కూడా కంపెనీ సూచించింది.

కరోనా సంక్రమణ నేపధ్యంలో ఐటీ ఉద్యోగులంతా వర్క్ ఫ్రం హోం బాట పట్టారు. ఈ నేపధ్యంలో పని భారం, అవిశ్రాంత పని గంటలపై ఉద్యోగుల్నించి ఫిర్యాదులు రావడం, అసంతృప్తి నేపధ్యంలో గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. Also read: Dhaka: మసీదులో పేలుడు..11 మంది మృతి

Trending News