Aid to India: కరోనా మహమ్మారిపై పోరు, భారత్‌కు విదేశాల్నించి పెద్దఎత్తున సహాయం

Aid to India: కరోనా మహమ్మారి ఉధృతికి వణికిపోతున్న ఇండియాకు పలు దేశాలు చేయూత అందిస్తున్నాయి. అత్యవసరమైన లైఫ్ సేవింగ్ డ్రగ్స్, ఆక్సిజన్ ఉత్పత్తి పరికరాల్ని పంపిస్తున్నాయి. ఈయూ, యూకే, సౌదీ దేశాల్నించి సహాయం అందుతోంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 4, 2021, 02:08 PM IST
Aid to India: కరోనా మహమ్మారిపై పోరు, భారత్‌కు విదేశాల్నించి పెద్దఎత్తున సహాయం

Aid to India: కరోనా మహమ్మారి ఉధృతికి వణికిపోతున్న ఇండియాకు పలు దేశాలు చేయూత అందిస్తున్నాయి. అత్యవసరమైన లైఫ్ సేవింగ్ డ్రగ్స్, ఆక్సిజన్ ఉత్పత్తి పరికరాల్ని పంపిస్తున్నాయి. ఈయూ, యూకే, సౌదీ దేశాల్నించి సహాయం అందుతోంది.

దేశంలో కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) ఉధృతంగా విస్తరిస్తోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య విపరీతంగా పెరగడంతో ఆక్సిజన్ కొరత తీవ్రమైంది.మరోవైపు బెడ్స్,అత్యవసర మందులు లేక అల్లాడుతున్నారు జనం. ఆక్సిజన్ అందక (Oxygen Shortage) ప్రాణాలు గాలిలో కల్సిపోతున్నాయి. ఈ తరుణంలో దేశానికి సహాయం చేసేందుకు విదేశాలు ముందుకొచ్చాయి. అత్యవసరమైన ప్రాణాధార ఔషధాలను, ఆక్సిజన్‌ ఉత్పత్తి పరికరాలను పంపిస్తున్నాయి.ఇటలీ సోమవారం ఒక నిపుణుల బృందాన్ని, వైద్య పరికరాలను భారత్‌కు పంపింది. ఇక యూకే (UK) నాలుగో దశ సాయం అందించింది. ఇందులో 60 వెంటిలేటర్లు, ఇతర పరికరాలు ఉన్నారు. ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్‌(Oxygen Plant)ను కూడా అందించింది.ఈ ప్లాంట్‌ ద్వారా ఒక ఆసుపత్రికి అవసరమైన ప్రాణవాయువును ఉత్పత్తి చేయొచ్చు. 

యూరోపియన్ యూనియన్ (Europian Union) సభ్యదేశాలైన డెన్మార్క్(Denmark),స్పెయిన్(Spain), నెదర్లాండ్స్‌ నుంచి కూడా ఇండియాకు సాయం అందనుంది.ఇండియాకు అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. డెన్మార్క్‌ నుంచి 53 వెంటిలేటర్లు, స్పెయిన్‌ నుంచి 119 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు( Oxygen Concentrators),145 వెంటిలేటర్లు పంపుతున్నట్లు ఈయూ తెలిపింది. ఇక నెదర్లాండ్స్‌ నుంచి 100 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, 30 వేల రెమ్‌డెసివిర్‌ వయల్స్(Remdesivir Injections), 449 వెంటిలేటర్లు రానున్నాయి. అటు జర్మనీ కూడా 15 వేల యాంటీ వైరల్‌ డ్రగ్స్‌ వయల్స్‌, 516 ఆక్సిజన్‌ సిలిండర్లు అందించింది. ప్రపంచంలోని పలు దేశాలు ఇండియాను ఆదుకునేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.

Also read: Corona Second Wave: కరోనా వైరస్ సంక్రమణలో కీలకమైన మార్పులు, కొన్ని రాష్ట్రాల్లో నిలిచిన పెరుగుదల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News