Trump versus Twitter: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు, ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌కు మధ్య ఘర్షణ పెరుగుతోంది. ట్రంప్ ఎక్కౌంట్‌ను శాశ్వతంగా నిషేధించడంతో వివాదం మరింతగా పెరిగింది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( America president donald trump ) ట్విట్టర్ అక్కౌంట్ ( Twitter account )ను ఆ సంస్థ శాశ్వతంగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల క్రితం ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ బిల్డింగ్ భవనాన్ని ముట్టడించడంతో హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఆందోళకారుల్ని రెచ్చగొట్టేవిధంగా ట్రంప్ ట్వీట్లు చేశారంటూ ట్విట్టర్ ట్రంప్ అక్కైంట్‌ను శాశ్వతంగా సస్పెండ్ చేసింది. ఫేస్‌బుక్ కూడా ఇదే నిర్ణయంయ తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ట్విట్టర్ తీసుకున్న ఈ నిర్ణయం ఇరువురి మధ్య ఘర్షణను మరింతగా పెంచింది. ఇటువంటిది జరుగుతుందని తాను ముందే ఊహించానని ట్విట్టర్ ( Twitter ) పై మండిపడ్డారు డోనాల్డ్ ట్రంప్ ( Donald trump ). ట్విట్టర్‌లో భావ ప్రకటన స్వేచ్ఛ లేదని, రాడికల్, వామపక్ష భావజాలాన్ని ప్రోత్సహించే ప్లాట్‌ఫామ్ అని మండిపడ్డారు. ట్విట్టర్‌లో కేవలం విషం చిమ్ముతూ మాట్లాడేవారికే ప్రాధాన్యత ఉంటుందన్నారు. అయితే ఇలాంటి చర్యలు తమను ఆపలేవని..చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు.
ప్రజలకు చేరువగా ఉండేందుకు ఇతర సైట్లతో సంప్రదింపులు జరుపుతున్నామని..సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ( Social media platform ) తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ విషయంలో త్వరలో బిగ్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. సైలెంట్‌గా ఉండే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ట్విట్టర్ పదే పదే వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛపై నిషేధం విధిస్తోందన్నారు ట్రంప్. తన గొంతు నొక్కేందుకు అక్కౌంట్ తొలగిస్తారా అంటూ మండిపడ్డారు. ట్విట్టర్ ఓ ప్రైవేట్ కంపెనీ అని..సెక్షన్ 230 ప్రకారం ప్రభుత్వం వెసులుబాటు ఇవ్వకపోతే మీ ఉనికే ఉండదని తీవ్ర విమర్శలు చేశారు.
Also read: Donald Trump: ట్రంప్‌కు షాకిచ్చిన ట్విట్టర్.. ఖాతాపై శాశ్వత నిషేధం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook