న్యూఢిల్లీ: గత 10 రోజుల క్రితం వరకు భయంకరంగా విజృంభించిన తరవాత తమ దేశంలో కరోనా మహమ్మారి అదుపులోనే ఉన్నట్లు జర్మనీ ఆరోగ్యశాఖ మంత్రి జెన్స్ స్పాన్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఇన్‌ఫెక్షన్ రేటు తగ్గిందని, వైరస్ బారి నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య, కొత్తగా వైరస్ సంక్రమిస్తున్న వారి సంఖ్య కన్నా ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి పూర్తి నియంత్రణలో ఉందన్నారు.
Read Also: Coronatest: ఏపీ సీఎం జగన్ కు కరోనా పరీక్ష..
కాగా వైరస్ సంక్రమణ రేటు కేవలం 0.7గా ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొనగా.. మరణాల సంఖ్య మాత్రం ప్రస్తుతం పెరుగుతుందన్నారు. హెల్త్ వర్కర్లకు సైతం వైరస్ సోకుతున్నట్లు సమాచాచారం వస్తోందన్నారు. జర్మనీలో చాలా విస్తృత స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహించారని, దేశంలో ఇప్పటి వరకు లక్షా 38 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, సుమారు 3868 మంది మరణించారని అన్నారు.
మరోవైపు తాజాగా నమోదైన మరణాలతో కలిపి చైనాలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 5000 లకు చెరువులో ఉంది. కరోనాకు కేంద్రంగా మారిన వూహాన్ నగరంలో ఇటీవల కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరగడం ఆశ్చ్యర్యం కలిగిస్తోందని ఓ సీనియర్ అధికారి తెలిపారు.