Pfizer vaccine: వ్యాక్సిన్ దుష్పరిణామాలు నిజమేనా..

Pfizer vaccine: ఫైజర్ వ్యాక్సిన్ తీసుకుంటే ఆడవారికి గెడ్డం మొలుస్తుందా ? మొసళ్లలా మారిపోతామా ? ఎంతవరకూ నిజమిది ? ఆయనీ వ్యాఖ్యలెందుకు చేశారు? కారణమేంటి?

Last Updated : Dec 19, 2020, 03:42 PM IST
  • ఫైజర్ వ్యాక్సిన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సెనారో
  • వ్యాక్సిన్ తీసుకుంటే ఆడవాళ్లకు గెడ్డం మొలుస్తుందని చెబుతున్న బోల్సెనారో
  • బ్రెజిల్ లో 7.1 మిలియన్ కరోనా వైరస్ కేసులు
Pfizer vaccine: వ్యాక్సిన్ దుష్పరిణామాలు నిజమేనా..

Pfizer vaccine: ఫైజర్ వ్యాక్సిన్ తీసుకుంటే ఆడవారికి గెడ్డం మొలుస్తుందా ? మొసళ్లలా మారిపోతామా ? ఎంతవరకూ నిజమిది ? ఆయనీ వ్యాఖ్యలెందుకు చేశారు? కారణమేంటి?

కోవిడ్ 19 వ్యాక్సిన్ ( Covid19 vaccine ) ‌కు సంబంధించి ముందు నుంచీ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సెనారో మరోసారి కొత్త వివాదానికి తెర లేపారు. కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే దుష్పరిణామాలు తలెత్తుతాయంటున్నారు. ముఖ్యంగా ఫైజర్ వ్యాక్సిన్ దృష్టిలో పెట్టుకుని ఆయనీ వ్యాఖ్యలు చేశారు. 

ఫైజర్ వ్యాక్సిన్ తీసుకుంటే మనుషులు మొసళ్లలా మారిపోవచ్చని వివాదం సృష్టించారు. అంతేకాకుండా ఆడవాళ్లకు గెడ్డం మొలుస్తుందన్నారు. కోవిడ్ 19 వ్యాక్సిన్ కార్యక్రమాన్ని చేపట్టిన ఫైజర్ కంపెనీ ( Pfizer vaccine )పై బ్రెజిల్ అధ్యక్షుడు ( Brazi president )తన దాడిని తీవ్రం చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ కారణంగా తలెత్తిన దుష్పరిణామాలకు తాము బాధ్యత వహించమని..అది మీ సమస్యని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత సూపర్ హ్యూమన్‌గా మారినా..మహిళలకు గెడ్డం మొలిచినా..పురుషలు ఎలా మాట్లాడినా వ్యాక్సిన్ తయారీదారులకు ఎలాంటి సంబంధముండదని అన్నారు. 

దేశ ప్రజల కోసమైతే వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని..కానీ తాను మాత్రం వ్యాక్సిన్ తీసుకోనన్నారు. ఇప్పటికే తనకు కరోనా వైరస్ సోకిన కారణంగా తన శరీరంలో యాంటీబాడీస్ ( Anti bodies ) ఉన్నాయని..అటువంటప్పుడు తానెందుకు వ్యాక్సీిన్ తీసుకోవాలని ప్రశ్నించారు. అందరికీ వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని..కానీ నిర్బంధమేదీ ఉండదన్నారు. 

బ్రెజిల్‌ ( Brazil ) లో ఇప్పటివరకూ 7.1 మిలియన్ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1 లక్షా 85 వేల మంది మృతి చెందారు. వైరస్ ప్రారంభమైన కొత్తలో కూడా ఇదొక ఫ్లూ మాత్రమేనంటూ వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు. Also read: Moderna vaccine: మోడెర్నా వ్యాక్సిన్‌కు ఎఫ్‌డీ‌ఏ ఆమోదం ఎప్పుడు..

Trending News