Bill Gates: 2022 చివరి నాటికి కొవిడ్ అంతం- అప్పటి వరకు జాగ్రత్త!

Bill Gates: కరోనా ఒమిక్రాన్ వేరియంట్​ చరిత్రలో ఏ వైరస్​ కూడా వ్యాపించనంత వేగంగా వ్యాపిస్తుందని ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్​గేట్స్​ అన్నారు. ఈ మహమ్మారి పట్ల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 23, 2021, 10:42 AM IST
  • ఒమిక్రాన్​ వేరియంట్​పై ప్రపంచానికి బిల్​గేట్స్ హెచ్చరిక
  • ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచన
  • ప్రతి ఒక్కరూ బూస్టర్​ డోసు కూడా వేసుకోవాలని సలహా
Bill Gates: 2022 చివరి నాటికి కొవిడ్ అంతం- అప్పటి వరకు జాగ్రత్త!

Bill Gates: కరోనా ఒమిక్రాన్​ వేరియంట్​పై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్​ తీవ్ర హెచ్చరికలు (Bill Gates on Omicron variant) చేశారు. దీని కారణంగా ప్రపంచమంతా అత్యంత అధ్వాన్న స్థితిలోకి జారుకునే ప్రమాదముందని ఆందోళన (Omicron scare) వ్యక్తం చేశారు.

ఒమిక్రాన్​ వేరియంట్​పై ఇటీవల వరుస ట్వీట్లు చేసిన బిల్​ గేట్స్​.. ఈ మహమ్మారి చరిత్రలో ఏ వైరస్​ను చూడనంత వేగంగా వ్యాపిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే తన సన్నిహితుల్లో చాలా మందికి ఈ వేరియంట్ సోకినట్లు వెల్లడించారు. ఈ కారణంగా తన హాలిడే ప్లాన్స్​ అన్ని రద్దు చేసుకున్నట్లు వివరించారు.

ఒమిక్రాన్​ సోకితే ఆరోగ్యంపై ఎంత తీవ్రమైన ప్రభవం ఉంటుందో చెప్పడం కష్టమని పేర్కొన్నారు బిల్​గేట్స్​. ఈ కారణంగా ఈ వైరస్​ గురించి మరింత సమాచారం తెలిసే వరకు మనమంతా అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు (Bill Gates on Omicron precautions) బిల్​గేట్స్​.

ప్రజలంతా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ.. బూస్టర్​ డోసు (Corona vaccine Booster dose) కూడా తీసుకోవాలని సలహా ఇచ్చారు బిల్​గేట్స్​. ప్రస్తుత సమయంలో మాస్కులు ధరించడం, సమూహాలుగా ఏర్పడటకపోవడం, వ్యాక్సిన్​ తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలన్నారు.

ప్రపంచంపై ఒమిక్రాన్​ ప్రభావం మూడు నెలలకన్నా తక్కువే ఉండొచ్చని అంచనా వేశారు బిల్​గేట్స్​. దశల వారీగా ఒమిక్రాన్​ వేరియంట్ 2022 చివరి నాటికి (Corona End by 2022) అంతమవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం బయటికెళ్లాలన్నా, ఏదైనా వేడుకలో పాల్గొనాలన్నా కొవిడ్ భయాలు నెలకొంటున్నాయని తెలిపారు బిల్​గేట్స్​. అయితే ఇది ఎల్లవేళల ఉండబోదని ఆయన పేర్కొన్నారు. ఏదో ఓ రోజు మహమ్మారి అంతమవుతుందన్నారు. సంతోషంగా ఒకరినొకరు కలుసుకోవచ్చన్నారు. ఆ సమయం త్వరలోనే రావాలని ఆకాంక్షించారు.

దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఒమిక్రాన్ వేరియంట్​ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సగానికిపైగా దేశాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. ఐరోపాలో దీని తీవ్రత అధికంగా ఉంది. ముఖ్యంగా యూకేలో కేసులు విపరీతంగా (Omicron in UK) పెరుగుతున్నాయి. ఇటీవల ఆక్కడ ఒక్క రోజులోనే 12 వేలకుపైగా ఒమిక్రాన్​ కేసులు నమోదయ్యాయి

Also read: Winter drinks: చలికాలంలో వెచ్చదనంతో పాటు ఎనర్జీనిచ్చే బెస్ట్ డ్రింక్స్..

Also read: Cannibalism: ఆ మూఢనమ్మకంతో నరమాంస భక్షణ-అమెరికాలో ఒళ్లు గగుర్పొడిచే కేసు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News