Fire Accident in Philippine ferry: దక్షిణ ఫిలిప్పీన్స్‌లో విషాదం చోటుచేసుకుంది. ఫెర్రీలో మంటలు చెలరేగడంతో దాదాపు 31 మంది మరణించారు. మరో 230 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది. ఈ అగ్ని ప్రమాదం 'ఎంవీ లేడీ మేరీ జాయ్ 3'’ అనే ప్రయాణికుల నౌకలో జరిగింది. ఈ నౌక మిండానావో ద్వీపంలోని జాంబోంగా సిటీ నుండి సులు ప్రావిన్స్‌లోని జోలో ద్వీపానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని విపత్తు అధికారి నిక్సన్ అలోంజో తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గురువారం తెల్లవారుజాము నాటికి మంటలను అదుపులోకి తెచ్చారు.
కాపాడబడిన వారిలో 35 మంది సిబ్బందితోపాటు 195 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ మంటల ఎగసిపడిన సమయంలో ఫెర్రీలో ఎయిర్ కండిషన్డ్ క్యాబిన్ లోపల నిద్రిస్తున్నారు. మంటలు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కొందరు నీళ్లలోకి దూకారు. ఇలా 10 మంది మృతి చెందారు. నౌకలో కాలిపోయిన స్థితిలో మరో 21 మంది మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన, ప్రాణాలతో బయటపడిన వారిని జాంబోంగా మరియు బాసిలన్‌లకు తీసుకెళ్లి.. చికిత్స అందించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 7,000 కంటే ఎక్కువ ద్వీపాలతో కూడిన ద్వీపసమూహం ఫిలిప్పీన్స్. సముద్ర రవాణా కారణంగా పడవలు తరుచూ ప్రమాదాలకు గురవుతాయి.
Also Read: People Killed: 11 మంది ప్రాణాలు తీసిన పిండి.. దారుణాతి దారుణం.. అసలు ఏమైందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook