Texas dairy farm explosion: అమెరికాలోని టెక్సాస్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. డిమిట్ పట్టణానికి సమీపంలో ఉన్న సౌత్ ఫోర్క్ డెయిరీ ఫాంలో పేలుడు (explosion in Texas dairy farm) సంభవించి సుమారు 18వేల ఆవులు చనిపోయాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనల ఏప్రల్ 10న జరిగినట్లు తెలుస్తోంది. డెయిరీ ఫాంలలో ఇంత పెద్ద ప్రమాదం జరగడం దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారని అక్కడి అధికారులు చెబుతున్నారు.
మీథేన్ వాయువు విడుదలవ్వడం వల్లే ఈ ఆవులన్నీ మృత్యువాత పడి ఉంటాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే ప్రమాదానికి గల స్పష్టమైన సమాచారం తెలియాల్సి ఉంది. 2018 నుంచి 2021 మధ్య యూఎస్ అంతటా దాదాపు మూడు మిలియన్ల పశువులు మంటల్లో కాలి చనిపోయి ఉంటాయని అధికారులు అంచనా వేశారు.
Also Read; Japan Army Helicopter Crashed: 10 మందితో సముద్రంలో కూలిన ఆర్మీ హెలీక్యాప్టర్ ?
అమెరికాలో పెద్ద సంఖ్యలో పశువులను పెంచుతారు. 15 వేల కంటే ఎక్కువ ఆవులు పెంచుతున్న ఫాంను అక్కడ ‘బార్’గా పిలుస్తారు. ఇందులో పనులన్నీ యంత్రాలే చేస్తాయి. ఏదైనా సమస్య వస్తే అప్పుడు కొంత మందిని పెట్టుకుని పని చేయించుకుంటారు. తాజాగా జరిగిన ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Also Read: H3N8 Bird Flu Virus: చైనాలో H3N8 బర్డ్ ఫ్లూ వైరస్‌తో తొలి మరణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి