Donald Trump: ట్రంప్ ఒక్క సంతకం.. 18 లక్షల మంది ఔట్..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ఈ సోమవారం అమెరికా 47వ అధ్యక్షుడిగా రెండోసారి శ్వేత సౌధంలో ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాదు యూఎస్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసాడో లేదో అమెరికా ఫస్ట్ నినాదంలో భాగంగా ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన భారతీయులకు చెక్ పెట్టేలా H1B వీసాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 21, 2025, 09:27 PM IST
Donald Trump: ట్రంప్ ఒక్క సంతకం.. 18 లక్షల మంది ఔట్..

Donald Trump: అమెరికాను ఒక పర్యాయం పరిపాలించి.. ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమి పాలై.. మళ్లీ నాలుగేళ్ల తర్వాత తిరిగి అధ్యక్ష పీఠమొక్కి డొనాల్డ్ ట్రంప్ చరిత్ర సృష్టించారు. ఇలా ఒక టర్మ్ గ్యాప్ తో గెలిచిన రెండో నేతగా డొనాల్ట్ ట్రంప్ చరిత్ర సృష్టించారు. ఇక తన దేశానికే మొదటి ప్రాధాన్యం అంటూ ముందు నుంచి చెబుతున్న ట్రంప్.. అందుకు తగ్గట్టే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతేకాదు అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే భారతీయులకు భారీ షాక్ ఇచ్చారు అమెరికా కొత్త ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఒక్క సంతకంతో దిమ్మతిరిగే నిర్ణయం తీసుకున్నారు. బర్త్ రైట్ సిటిజన్ షిఫ్ రద్దు చేస్తూ ఆర్డర్ ఇచ్చారు. దీంతో 100 ఏళ్ల విధానానికి ఒక్క సంతకంతో చెక్ పెట్టారు. ఈ నిర్ణయం భారతీయులకు అశనిపాతమే అని చెప్పాలి.  ప్రస్తుతం USలో 54 లక్షల మంది భారతీయులు ఉన్నారు.

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

వీరిలో 34శాతం అమెరికాలో పుట్టిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు.ఇకపై పుట్టుకతో వచ్చే పౌరసత్వం ఈ నిర్ణయంతో రద్దు కావడం పట్ల భారతీయుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.  మొత్తంగా ఒక్క సంతకంతో దాదాపు 18 లక్షల మందిని డిపోర్ట్ చేస్తారా అనేది చూడాలి.

చాలామంది ఇండియన్స్  అమెరికాలో చదువుకోవాలి.. స్థిరపడాలి అని కోరుకుంటారు. అలాంటి వారికి యూఎస్ H1B వీసాలను జారీ చేస్తుంది. వరల్డ్ కంట్రీస్ కు  అమెరికా జారీ చేసే H1B వీసాల్లో దాదాపు 72 శాతం భారతీయులు వినియోగించుకుంటున్నారని అమెరికన్ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ట్రంప్ రాకతో.. ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో మార్పులతో.....H1B వీసా హోల్డర్లకు, ఇకముందు వీసా పొందాలనుకునే భారతీయులకు ఇకపై ఇబ్బంది తప్పదు.

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News