Alexei Navalny: విషప్రయోగం నుంచి కోలుకున్న రష్యా ప్రతిపక్షనేత

రష్యాకు చెందిన ప్రతిపక్ష నేత ఆలెక్సి నవాల్నీ ( Alexei Navalny ) కి చెందిన తాజా చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ( Social Media ) చక్కర్లు కొడుతున్నాయి. 

Last Updated : Sep 19, 2020, 09:18 PM IST
    • రష్యాకు చెందిన ప్రతిపక్ష నేత ఆలెక్సి నవాల్నీ కి చెందిన తాజా చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
    • కొంత కాలం క్రితం ఆయనపై విషప్రయోగం జరిగినట్టు ప్రపంచానికి అనేక మీడియా సంస్థలు తెలియజేశాయి.
    • అప్పటి నుంచి ఆయన ఇంటెన్సీవ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నారు.
    • ఆయనపై రాజకీయ ప్రత్యర్థులు కావాలని విషయప్రయోగం చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి.
Alexei Navalny: విషప్రయోగం నుంచి కోలుకున్న రష్యా ప్రతిపక్షనేత

రష్యాకు చెందిన ప్రతిపక్ష నేత ఆలెక్సి నవాల్నీ ( Alexei Navalny ) కి చెందిన తాజా చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ( Social Media ) చక్కర్లు కొడుతున్నాయి. కొంత కాలం క్రితం ఆయనపై విషప్రయోగం జరిగినట్టు ప్రపంచానికి అనేక మీడియా సంస్థలు తెలియజేశాయి. అప్పటి నుంచి ఆయన ఇంటెన్సీవ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నారు. ఆయనపై రాజకీయ ప్రత్యర్థులు కావాలని విషయప్రయోగం చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి.

ALSO READ| Trump Residency: బిజినెస్ ట్రంప్ బ్లెడ్ లోనే ఉంది... ఇల్లు రాజభవనం కన్నా తక్కువేం కాదు

తాజాగా నవాల్నీ కోలుకున్నట్టు నిర్ధారించే చిత్రాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఆలెక్సీ నవాల్నీకి ఆసుపత్రి మెట్ల నుంచి దిగుతున్నప్పుడు తీసిన ఫోటో మీరు ఫీచర్ ఇమేజ్ లో చూశారు. ఇందులో ఆయన ఎలాంటి సపోర్ట్ లేకుండా తన శక్తిమేరా కదులుతున్నట్టు గమనించవచ్చు. అయితే నవాల్నీ తిరగి సంపూర్ణ శక్తిని సంతరించుకోవడానికి సమయం పడుతుంది అని వైద్యులు తెలిపారు. అదే విధంగా మెట్లు ఎక్కడం వంటి చిన్న చిన్న పనులు చేయడానికి కూడా బాగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు వైద్యులు. విషప్రయోగం తరువాత వైద్యులు ఆయన విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Давайте расскажу, как идёт мое восстановление. Это уже ясная дорога, хоть и неблизкая. Все текущие проблемы вроде того, что телефон в моих руках бесполезен, как камень, а налить себе водички превращается в целый аттракцион, - сущая ерунда. Объясню. Совсем недавно я не узнавал людей и не понимал, как разговаривать. Каждое утро ко мне приходил доктор и говорил: Алексей, я принёс доску, давайте придумаем, какое на ней написать слово. Это приводило меня в отчаяние, потому что хоть я уже и понимал в целом, что хочет доктор, но не понимал, где брать слова. В каком месте головы они возникают? Где найти слово и как сделать так, чтобы оно что-то означало? Все это было решительно непонятно. Впрочем, как выразить своё отчаяние, я тоже не знал и поэтому просто молчал. И это я еще описываю поздний этап, который сам помню. Сейчас я парень, у которого дрожат ноги, когда он идёт по лестнице, но зато он думает: «о, это ж лестница! По ней поднимаются. Пожалуй, надо поискать лифт». А раньше бы просто тупо стоял и смотрел. Так что много проблем ещё предстоит решить, но потрясающие врачи университетской Берлинской клиники «Шарите» решили главную. Они превратили меня из «технически живого человека» в того, кто имеет все шансы снова стать Высшей Формой Существа Современного Общества, - человеком, который умеет быстро листать инстаграм и без размышлений понимает, где ставить лайки.

A post shared by Алексей Навальный (@navalny) on

ALSO READ | IPL 2020: ఐపీఎల్ లో మనం మిస్సయ్యే టాప్ 5 విషయాలివే

రష్యా  (Russia ) ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. ఎందుకంటే నవాల్నీకి ఏమైనా జరిగితే అన్ని వేళ్లు క్రెమ్లిన్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వారివైపే వెళ్తాయి. దీనికి కారణం నవాల్నీ ప్రతిపక్షనేతగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను ప్రత్యక్షంగా విమర్శించే సత్తా కలిగి ఉన్న నాయకుడిగా ఎదగడమే. 

రష్యాలో పుతిన్ ను ఈ విధంగా విమర్శించే వారు దాదాపు ఎవరూ లేరు. దీంతో నవాల్నీకి ఆరోగ్యంగా ఉండటం అనేది పుతిన్ కు కూడా అవసరం. లేదంటే అవినీతిపై పోరాటం చేసే నవాల్నీ కి మద్దతు పలికే వారి సంఖ్య భారీగా పెరిగి పుతిన్ తన మద్ధతు కోల్పోయే అవకాశం ఉంది. 

తన ఆరోగ్యంపై దిగులు పడుతున్న వారికోసం నవల్నీ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో తన ఫొటోలను షేర్ చేశాడు. ఆగస్టులో సైబీరియాలో ఉన్న సమయంలో నవాల్నీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అప్పట్లో ఆయనపై విషప్రయోగం జరిగింది అని పలు మీడీయా సంస్థలు నివేదించాయి. తరువాత ఆయనకు మెరుగైన చికిత్స కోసం జర్మనికి తరలించారు. 

ALSO READ| Calories Count: మీ ఆహారంలో ఎన్ని కేలరీలు ఉన్నాయో తెలుసుకోండి

మూడు దేశాల్లో వివిధ ల్యాబ్స్ లో నిర్వహించిన పరీక్షా నివేదికలో నవాల్నీపై విషప్రయోగం జరిగినట్టు తేలింది. దీంతో పలు దేశాలు రష్యా ప్రభుత్వం నుంచి వివరణ కూడా కోరాయి. అయితే పుతిన్ మాత్రం నవాల్నీ ఆరోగ్యం విషమించడంలో క్రెమ్లిన్ పాత్ర లేదు అని స్పష్టం చేశాడు.

కొంత కాలం క్రితం తను ఆసుపత్రి బెడ్ పై ఉన్న చిత్రాన్ని పోస్ట్ చేశాడు నవాల్నీ.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN  App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

 

Trending News