Station Ghanpur MLA Rajaiah: స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే రాజయ్యపై మహిళా సర్పంచ్ సంచలన ఆరోపణలు

Station Ghanpur MLA Rajaiah: స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యపై హన్మకొండ జిల్లా జానకీపురం మహిళా సర్పంచ్ నవ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజయ్య పీఏ మాటలు నమ్మి తన భర్త ప్రతీ రోజూ తనని వేధిస్తున్నాడని నవ్య వాపోయారు.

Written by - Pavan | Last Updated : Jun 22, 2023, 10:10 AM IST
Station Ghanpur MLA Rajaiah: స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే రాజయ్యపై మహిళా సర్పంచ్ సంచలన ఆరోపణలు

Station Ghanpur MLA Rajaiah: స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యపై హన్మకొండ జిల్లా జానకీపురం మహిళా సర్పంచ్ నవ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజయ్య పీఏ మాటలు నమ్మి తన భర్త ప్రతీ రోజూ తనని వేధిస్తున్నాడని నవ్య వాపోయారు. ప్రతీ రోజు తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని నవ్య ఆందోళన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే రాజయ్యతో పాటు ఎమ్మెల్యే పిఏ, తన భర్తపై కేసు పెడతానని జానకిపురం సర్పంచ్ నవ్య స్పష్టంచేశారు. 

గతంలో తాను చేసిన ఆరోపణలు అవాస్తవమని బాండ్ పేపర్ రాసివ్వాల్సిందిగా ఎమ్మెల్యే రాజయ్య తన పీఏ ద్వారా తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు అని ఆరోపించారు. 20 లక్షల రూపాయలు అప్పుగా ఇస్తామని చెప్పి తన చేత తన ఒప్పంద పత్రం తరహాలో ఒక బాండ్ పేపర్ పై రాసి ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారని నవ్య ఆందోళన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య పంపిన బాండ్ పేపర్లపై సంతకాలు పెట్టాల్సిందిగా స్వయంగా తన భర్తే ఇబ్బందులు పెడుతున్నారు అని వాపోయారు. ఎమ్మెల్యే రాజయ్య పంపించిన బాండ్ పేపర్లలో తనకు రూ. 20 లక్షలు అప్పు ఇచ్చినట్లుగా రాసి ఉంది.. కానీ వాస్తవానికి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఎమ్మెల్యే రాజయ్య ఇచ్చింది లేదు.. తాను తీసుకున్నది లేదు అని నవ్య స్పష్టంచేశారు. 

ఎమ్మెల్యే రాజయ్యపై పోరాటంలో తనకు అండగా నిలవాల్సిన తన భర్త తన పక్షం కాకుండా ఎమ్మెల్యే పక్షం పుచ్చుకోవడం వెనుక ఎమ్మెల్యే పీఏ హస్తంతో పాటు మరొక మహిళా ప్రజాప్రతినిధి కుట్ర కూడా దాగి ఉందని నవ్య ఆరోపించారు. తన భర్తను ట్రాప్ చేసిన ఒక మహిళా ప్రజాప్రతినిధి.. తన భర్తకు డబ్బులు ఆశ చూపించి తనపైనే ఒత్తిడి తీసుకొచ్చేలా చేస్తున్నారని నవ్య చెప్పుకొచ్చారు. 

తమ మండలానికి చెందిన ఒక దొర గతంలో జరిగిన గొడవలో ఎమ్మెల్యే వద్ద సెటిల్మెంట్ చేయిస్తానని చెప్పి రూ.5 లక్షలు తీసుకున్నాడు. త్వరలోనే అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు బయటపెడతా అని హెచ్చరించారు. గతంలో తాను ఎమ్మెల్యే వద్ద డబ్బులు తీసుకున్నాను అని చేస్తోన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. ఆ ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదు అని నవ్య స్పష్టంచేశారు.

ఇది కూడా చదవండి : Revanth Reddy Slams BRS: పొంగులేటి, జూపల్లి అందుకే కాంగ్రెస్ పార్టీలోకి

గతంలో ఎమ్మెల్యే రాజయ్యపై తాను చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని.. తన వెనక ఓ బడా నాయకుడు ఉండి ఇదంతా తనతో చేయించినట్లు అగ్రిమెంట్ పేపర్లపై సంతకాలు పెడితే అప్పుగా రూ.20 లక్షలు ఇస్తామని ఎమ్మెల్యే పీఏ తన భర్తతో మాట్లాడాడని అప్పటి నుంచి ఆ అగ్రిమెంట్ పెపర్లపై సంతకాలు పెట్టాలని తన భర్త ప్రతిరోజూ తనను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నాడని మహిళా సర్పంచ్ నవ్య జీ తెలుగు న్యూస్ ప్రతినిధికి చెప్పుకుని బోరుమన్నారు.

ఇది కూడా చదవండి : khammam politics: పొంగులేటి ఇంటికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News