Challa Dharma Reddy: కొండా మురళికి దమ్ముంటే.. చల్లా ధర్మా రెడ్డి సవాల్

Challa Dharma Reddy Dares Konda Murali And Konda Surekha: కొండా దంపతులు భాష మార్చుకోవాలి అని పరకాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత చల్ల ధర్మా రెడ్డి హెచ్చరించారు. మొగతనం ఉన్నదా లేదా అని కొండా మురళి దంపతులు సవాళ్లు విసురుతున్నారు.. మరి తమ మగతనం గురించి కొండా కుటుంబానికి ఎలా చెప్తారో వాళ్లే చెప్పాలి అంటూ చల్ల ధర్మా రెడ్డి ఎద్దేవా చేశారు.

Written by - Pavan | Last Updated : Jun 20, 2023, 07:11 AM IST
Challa Dharma Reddy: కొండా మురళికి దమ్ముంటే.. చల్లా ధర్మా రెడ్డి సవాల్

Challa Dharma Reddy Dares Konda Murali And Konda Surekha: కొండా మురళి రోడ్డు మీద కుక్క లాంటి వాడని ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. కొండా మురళి రౌడీయిజం చేసి భారీ మొత్తంలో డబ్బు సంపాదించాడని.. ఇకనైనా కొండా మురళి మారి సన్మార్గంలోకి వస్తారనే ఆశతో ఆనాడు సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చాడని అన్నారు. అయినప్పటికీ కొండా మురళి, కొండా సురేఖ దంపతులు తమ వైఖరినీ వీడటం లేదు అని మండిపడ్డారు.

కొండా సురేఖ ఆనాడు కుక్కను కర్చి రాజకీయాల్లోకి వచ్చారు అంటూ కొండా సురేఖపై సెటైర్లు వేసిన చల్ల ధర్మా రెడ్డి... కొండా దంపతులు వరంగల్ జిల్లా కోసం చేసిన త్యాగం ఏంటి ? అభివృద్ధి పనులు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. కొండా దంపతులు ఏం వృత్తి చేసి అంత డబ్బు సంపాదించారని.. వాళ్లు ఏ ఆదాయం కింద ప్రభుత్వానికి పన్నులు కట్టారో చెప్పాలి అని చల్లా ధర్మా రెడ్డి ప్రశ్నించారు. రౌడీయిజం చేసి డబ్బులు సంపాదించిన నేపథ్యం కొండా మురళి కుటుంబానిది అని కొండా కుటుంబంపై ఆరోపణలు గుప్పించారు.

కొండా దంపతులకు రాజకీయ పునర్జన్మను ఇచ్చింది కేసీఆర్ అని గతంలో స్వయంగా మీరే కదా చెప్పింది అని చల్లా ధర్మా రెడ్డి కొండా మురళి, కొండా సురేఖ దంపతులను నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నన్నాళ్లు ఉండి బయటికిపోయాకా కేసీఆర్ ని తిడుతున్నట్టే.. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొండా దంపతులు రేపు రేవంత్ రెడ్డిని కూడా తిడతారు అని అన్నారు. అసలు కొండా దంపతులు తిట్టని నేతలు ఎవరైనా ఉన్నారా ? అంటూ చురకలు అంటించే ప్రయత్నం చేశారు. 

కొండా మురళికి దమ్ముంటే పరకాలకు రావాలి.. చల్లా ధర్మా రెడ్డి సవాల్
కొండ మురళి కుటుంబ నేపథ్యం గురించి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి మాట్లాడుతూ, మీ చరిత్రను బట్టలిప్పి రోడ్డు మీద వేసింది మీ మేనకొడలే కదా అని ఎద్దేవా చేశారు. సొంత గ్రామంలోనే భూములు అక్రమంగా లాక్కొని అమ్ముకున్న చరిత్ర కలిగిన కొండా మురలి, కొండా సురేఖ దంపతుల బుద్ధి ఎలాంటిదో వరంగల్ ప్రజలకు తెలుసు అని అన్నారు. కొండా మురళిని ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్న ధర్మా రెడ్డి.. కొండా మురళి కుటుంబంలో ముగ్గురిలో ఎవరికి దమ్ముంటే వారు పరకాలకు వచ్చిచూపించాలి అని సవాల్ విసిరారు. ఒకప్పుడు కొండా మురళిని నమ్ముకున్న అనుచరులు అంతా ఇప్పుడు తన వెనుక ఉన్నారు అని ధర్మా రెడ్డి స్పష్టంచేశారు.

ఇది కూడా చదవండి : KCR's Big Decision: రైతుల కోసం మరో సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్

ఇకనైనా కొండా మురళి, కొండా సురేఖ దంపతులు తమ భాష మార్చుకోవాలి అని హితవు పలికిన బీఆర్ఎస్ ఎమ్మల్యే చల్లా ధర్మా రెడ్డి.. " అరేయ్ కొండా మురళి.. నోరు తెరిస్తే నా భాష ఏంటో చూపిస్తా " అంటూ పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఎవరికీ బీ టీం కాదన్న ఆయన... కేసీఆర్ ఏంటో త్వరలోనే తెలుస్తుంది అని మండిపడిన ధర్మా రెడ్డి... కేసీఆర్‌పై శరత్ పవన్ చేసిన వ్యాఖ్యలు ఊహాగానాలు మాత్రమేనని.. వాళ్లు ఊహించుకుంటున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకే కాదు.. మరెవ్వరికీ అనుకూలం కాదు అని తేల్చిచెప్పారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు. సవాళ్లుపై కొండా మురళి, కొండా సురేఖ దంపతులు ఏమని స్పందించనున్నారో వేచిచూడాల్సిందే మరి.

ఇది కూడా చదవండి : Telangana Govt Good News: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ, డీఆర్ విషయంలో సర్కారు గుడ్ న్యూస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News