YS Sharmila On LB Nagar Woman Incident: ఎల్బీనగర్లో గిరిజన మహిళపై పోలీసులు దాడి చేయడాన్ని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఖండించారు. ఈ ఘటనలో గాయపడిన మహిళను శనివారం ఆమె పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. పోలీసులు అకారణంగా స్టేషన్‌కు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి గాయపర్చిన గిరిజన మహిళ లక్ష్మిని ఈరోజు పరామర్శించినట్లు చెప్పారు. ఒక గిరిజన మహిళకు ఇంత అన్యాయం జరుగుతుంటే గిరిజన శాఖ మంత్రి ఎక్కడ..? అని ప్రశ్నించారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత నీచమైన చర్యలకు పాల్పడితే.. ఇక మహిళలకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది..? అని షర్మిల ప్రశ్నించరు. రౌడీల్లా, రేపిస్టుల్లా పోలీసులు దారుణంగా ప్రవర్తించారని.. మహిళను చెప్పుకోలేని చోట కొడతారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అరాచకానికి పాల్పడిన ఎస్ఐ రవికుమార్, కానిస్టేబుల్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదు..? అని ప్రశ్నించారు.
బాధిత మహిళపై దాడి చేసిన వారిని కాకుండా ఎవరో ఇద్దరు కానిస్టేబుళ్లని ఎందుకు సస్పెండ్ చేశారు..? అని నిలదీశారు షర్మిల. అసలు ఒక మహిళను ఇంత దారుణంగా కొట్టే హక్కు మీకు ఎక్కడిది..? అని అడిగారు. గిరిజన మహిళ లక్ష్మికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తాము చేపట్టిన ధర్నాను అడ్డుకోవడం సిగ్గుమాలిన చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు పరిపాలన చేతకాలేదు కానీ తమను అరెస్ట్ చేయడం చేతనైందని అన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్, ప్రభుత్వం ఈ మహిళకు ఎలా న్యాయం చేస్తారో సమాధానం చెప్పాలన్నారు. తక్షణమే నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి, బాధిత మహిళకు రూ.25 లక్షల నష్టపరిహారం, 120 గజాల భూమి ఇస్తామని హామీ ఇస్తూ బహిరంగంగా ప్రభుత్వం తరఫున హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ గిరిజన మహిళకు న్యాయం చేయకపోతే ప్రజలే కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు.
ఈ ఘటనలో పోలీసులపై ఎస్టీ, ఎస్సీ కేసులు నమోదు చేశారు ఎల్బీనగర్ పోలీసులు. 324, 354, 379, ST SC POA ACT 2015 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్, ఒక ఎస్ఐపై కేసు బుక్ చేశారు. బాధితురాలి కూతురు పూజ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు. తన తల్లిని అసభ్యంగా కొడుతూ పోలీసులు దాడి చేశారని ఫిర్యాదు చేసింది.
కులం పేరుతో దూషిస్తూ తల్లిపై దాడి ఆవేదన వ్యక్తం చేసింది.
Also Read: Onion Prices Today: ఉల్లి ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 40 శాతం ఎగుమతి సుంకం విధింపు
Also Read: Etela Rajender: లంబాడా తల్లుల శీలాన్ని శంకిస్తున్నారు.. సీఎం కేసీఆర్‌పై ఈటల ఫైర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook