Weather Forecast: రానున్న మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు.. అలర్ట్ జారీ చేసిన ఐఎండీ..

Ts Weather Update: నైరుతి ఋతుపవనాలు దేశ వ్యాప్తంగా విస్తరించాయి. ఉత్తర అరేబియా సముద్రము,  మహారాష్ట్ర లోని కొన్ని ప్రాంతాల లోకి రుతుపవనాలు వ్యాపించాయి. దీని ప్రభావం వల్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 10, 2024, 03:53 PM IST
  • రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు..
  • అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు..
Weather Forecast: రానున్న మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు.. అలర్ట్ జారీ చేసిన ఐఎండీ..

Meteorological Analysis rain fall in telangana: తెలంగాణలో కొన్నిరోజులుగా రుతుపవనాలు జోరుగా విస్తరించాయి. దీనికి తోడు ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల కూడా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర చోట్ల జోరుగా వర్షాలు పడుతున్నాయి. ఇప్పటి దాక ఉక్కపోతతో ఇబ్బందులు పడిపోయిన జనాలు, ఇప్పుడు వర్షం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులతో తలలు పట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. నైరుతి ఋతుపవనాలు ఈరోజు ఉత్తర అరేబియా సముద్రము,  మహారాష్ట్ర లోని కొన్ని ప్రాంతాలు లోకి విస్తరించాయని వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది.

Read more: Snakes venom: ఈ మొక్కలతో పాము విషం బలాదూర్.. ఇలా పెంచుకోవాలంటున్న నిపుణులు..

దీని ప్రభావం వల్ల.. మహారాష్ట్రలోని నాసిక్ తోపాటు, తెలంగాణ, ఛత్తీస్ గఢ్, ఏపీల్లో కూడా వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, ఆదిలాబాద్, వంటి అనేక ప్రాంతాలలో భారీ నుంచి అతి  భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది. మెయిన్ గా ఈరోజు.. క్రింది స్థాయిలోని గాలులు పశ్చిమ, నైరుతి దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకు వీస్తున్నాయని, దీని ప్రభావం వల్ల.. రాగల 3 రోజులపాటు  మోస్తరు నుంచి భారీగా వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది.  ఇక తెలంగాణలో కొన్నిరోజులుగా చల్లగానే ఉంటుంది. అదే విధంగా రాగల మూడురోజుల పాటు కొన్ని చోట్ల బలమైన గాలులతో భారీ నుంచి అతిభారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వాతావరణ కేంద్రం ఒక ప్రకటన జారీ చేసింది.

రుతుపవనాలు, ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల.. ఈరోజు,రేపు , ఎల్లుండి ఉరుములు,  మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని తెలుస్తోంది. అదే విధంగా.. గంటకు 30 నుండి 40 కి. మీల వేగం తో కూడిన ఈదురు గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. ముఖ్యంగా సాయంత్రం పూట కొన్నిరోజులుగా వర్షాలు కురుస్తుండటంతో ట్రాఫిక్ సమస్య నెలకొంటుంది. రోడ్డుపైన గుంతలలో  నీళ్లు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ప్రజలు మ్యాన్ హోళ్లలో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు.

Read more; Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..

కొన్నిచోట్ల మోకాళ్ల లోతు వరకు కూడా నీళ్లు వచ్చేస్తున్నాయి. ఇక వర్షాకాలం నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు, వాతావరణ కేంద్రం అధికారులు సూచిస్తున్నారు. కరెంట్ పోల్ దగ్గర, చెట్లకు కరెంట్ తీగలు వంటి వేలాడుతూ ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప వర్షంలో బైటకు రావోద్దని అధికారులు ప్రజలకు సూచనలు చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News