తెలంగాణలో బీజేపీ నేతలు తమ మేనిఫెస్టోపై ప్రకటన చేయడం జరిగింది. బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ.. తాము గనుక అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు అదనంగా రాష్ట్ర సర్కార్ విధిస్తున్న వ్యాట్‌ను తగ్గిస్తామని ఆయన అన్నారు. అలాగే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ బ్యాంకు పరీక్షలు మొదలైన వాటికి ప్రిపేర్ అయ్యే అభ్యర్ధులకు తామే స్వయంగా కోచింగ్ ఇస్తామని ఆయన అభిప్రాయపడ్డారు. అదేవిధంగా బీజేపీ అధికారంలోకి వస్తే మున్సిపల్, పంచాయితీ శాఖల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిపై ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులను పర్మినెంట్ ఉద్యోగులను చేస్తామని అన్నారు.
ఇండ్ల నిర్మాణం విషయంలో కూడా పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని.. పూర్తిస్థాయి కమిటీ వేసి పారదర్శకతతో నిర్మాణాలు చేయడానికి యోచిస్తామని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం వైఖరి చాలా దారుణంగా ఉందని.. ముఖ్యంగా జవాబుదారీతనం లోపించడం వల్ల లెక్కలు అసలు తేలడం లేదని.. తాము గనుక అధికారంలోకి వస్తే అన్ని ప్రణాళికబద్ధంగా చేయడానికి ప్రయత్నిస్తామని ప్రభాకర్ అభిప్రాయపడ్డారు.
తమ మేనిఫెస్టోని సకల జనుల మేనిఫెస్టోగా ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా లిక్కర్ షాపుల నియంత్రణ విషయంలో బీజేపీ కట్టుదిట్టంగా ఉంటుందని.. ఆ షాపులు వారానికి ఐదు రోజులు మాత్రమే పనిచేసేలా చూస్తామని.. ఎక్సైజ్ శాఖ లాభాల కోసం ప్రజారోగ్యాన్ని తమ పార్టీ పణంగా పెట్టదని.. అందుకు అనుగుణంగా నిబంధనలు సడలిస్తామని ఆయన తెలిపారు. అలాగే వాటర్ ఛార్జీలు తగ్గిస్తామని కూడా ఆయన అన్నారు. నగరాల్లో ప్రస్తుతం నీటి ఛార్జీలు రూ.250 నుండి రైూ.300 వరకు ఉన్నాయని.. వాటిని రూ.6 లకు తగ్గిస్తామని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు.