Chalo TGPSC: పోలీస్‌ నిర్బంధాల మధ్య నిరుద్యోగుల టీజీపీఎస్సీ ముట్టడి సక్సెస్‌

Unemployees Chalo TGPSC Success: హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నిరుద్యోగులు యుద్ధం ప్రకటించారు. వారు చేపట్టిన టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడి విజయవంతమైంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jul 5, 2024, 01:33 PM IST
Chalo TGPSC: పోలీస్‌ నిర్బంధాల మధ్య నిరుద్యోగుల టీజీపీఎస్సీ ముట్టడి సక్సెస్‌

Chalo TGPSC Success: తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన నిరుద్యోగులు మళ్లీ నాటి ఉద్యమ కాలాన్ని గుర్తు చేస్తున్నారు. పదేళ్ల తర్వాత మళ్లీ నిరుద్యోగులు ఉద్యమ బాట పట్టారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో విఫలమవడంతో నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. ఈ క్రమంలోనే చేపట్టిన చలో టీజీపీఎస్సీ కార్యక్రమం విజయవంతమైంది. ఉదయం నుంచి పోలీసుల నిర్బంధాలు, అరెస్ట్‌లు కొనసాగినా కూడా టీజీపీఎస్సీ ముట్టడి కార్యక్రమం సక్సెస్‌ కావడం గమనార్హం.

Also Read: Telangana Thalli Statue: తెలంగాణలో బుల్డోజర్‌ పాలన? తెలంగాణ తల్లి విగ్రహానికి కూడా స్థానం లేదా?

డీఎస్సీ వాయిదా వేయాలని, గ్రూప్‌ 1, 2 ఉద్యోగాల సంఖ్య పెంచాలి, జాబ్‌ క్యాలెండర్‌ విడుదల తదితర డిమాండ్‌లపై నిరుద్యోగ జేఏసీ చలో టీజీపీఎస్సీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. నిరుద్యోగుల పోరాటానికి బీఆర్‌ఎస్‌ పార్టీ విద్యార్థి విభాగం, ఏబీవీపీ, ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలు, కుల మత ప్రజా సంఘాలు కూడా మద్దతు ప్రకటించారు. శుక్రవారం టీజీపీఎస్సీ ముట్టడి కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
 

Also Read: Letter To KTR: మాజీ మంత్రి కేటీఆర్‌కు యువతి లేఖ.. ఏం రాసిందో తెలుసా?

 

హైదరాబాద్‌ నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో నిరుద్యోగులు ముట్టడించారు. కళ్లు గప్పి కార్యాలయాన్ని ముట్టడించడంతో పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని పలు పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. ముట్టడికి వస్తున్న నిరుద్యోగులకు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. 

ఉదయం నుంచే అరెస్ట్‌లు
నిరుద్యోగుల టీజీపీఎస్సీ ముట్టడిని భగ్నం చేసేందుకు పోలీసులు అర్ధరాత్రి నుంచే రంగంలోకి దిగారు. ముఖ్యంగా ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని నిఘాలో ఉంచారు. హాస్టల్స్‌, స్టడీ హాల్స్‌, మెస్‌లు తదితర వాటిని జల్లెడ పట్టారు. తెల్లవారుజామున ఓయూ విద్యార్థి నాయకులు అంసా, నామ సైదులు, విజయ్ నాయక్‌ను ముందస్తు అరెస్ట్‌లు చేశారు. ఓయూ, నల్లకుంట పోలీసులు విద్యార్థులను నిర్బంధించారు. అశోక్‌నగర్, చిక్కడపల్లి సహా మెట్రో స్టేషన్ల వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మొహరించి భయబ్రాంతులకు గురి చేశారు. ఎక్కడికక్కడ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

బీఆర్‌ఎస్‌ ముట్టడి
టీజీపీఎస్సీ కార్యాలయాన్ని బీఆర్ఎస్‌ పార్టీ విద్యార్థి విభాగం ముట్టడించింది. గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు టీజీపీఎస్సీ కార్యాలయానికి చేరుకున్నారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలని గెల్లు శ్రీను డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియా కూటమిలో భాగమైన ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా జత కలవడం ఆసక్తికరం. వారిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అరెస్ట్‌ల ఖండన
శాంతియుతంగా చేపట్టిన టీజీపీఎస్సీ ముట్టడి కార్యక్రమంలో అరెస్ట్‌లు కొనసాగడంపై బీఆర్‌ఎస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్ రావు తదితరులు అరెస్ట్‌లను ఖండించారు. నిరుద్యోగులు, విద్యార్థి సంఘ నాయకులను అరెస్టు చేయడం సరికాదన్నారు. హామీలు ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజాపాలన అని గొప్పగా చెప్పే రేవంత్‌ రెడ్డి శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు కూడా నిరుద్యోగులకు లేదా అని ప్రశ్నించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News