KTR OLD CITY: పాతబస్తీకి మంత్రి కేటీఆర్.. పోలీసుల హై అలర్ట్.. ఏం జరుగుతుందో?

KTR OLD CITY: నాలుగు రోజుల పాటు ఆందోళనలతో అట్టుడుకిన హైదరాబాద్ పాతబస్తీ శుక్రవారం మాత్రం ప్రశాంతంగా ఉంది. శుక్రవారం ప్రార్థనల తర్వాత ఏం జరుగుతుందోనన్న భయంతో నగరవాసులు వణికిపోయినా.. అంతా ప్రశాంతంగా సాగడంతో ఊపిరి పీల్చుకున్నారు.  తాజాగా పాతబస్తీలో శనివారం మంత్రి కేటీఆర్ పర్యటిస్తుండటం మళ్లీ టెన్షన్ పుట్టిస్తోంది.

Written by - Srisailam | Last Updated : Aug 27, 2022, 11:30 AM IST
KTR OLD CITY: పాతబస్తీకి మంత్రి కేటీఆర్.. పోలీసుల హై అలర్ట్.. ఏం జరుగుతుందో?

KTR OLD CITY:  నాలుగు రోజుల పాటు ఆందోళనలతో అట్టుడుకిన హైదరాబాద్ పాతబస్తీ శుక్రవారం మాత్రం ప్రశాంతంగా ఉంది. శుక్రవారం ప్రార్థనల తర్వాత ఏం జరుగుతుందోనన్న భయంతో నగరవాసులు వణికిపోయినా.. అంతా ప్రశాంతంగా సాగడంతో ఊపిరి పీల్చుకున్నారు.  తాజాగా పాతబస్తీలో శనివారం మంత్రి కేటీఆర్ పర్యటిస్తుండటం మళ్లీ టెన్షన్ పుట్టిస్తోంది. పాతబస్తీలో భారీగా బలగాలను మోహరించారు. కేంద్ర బలగాలను రంగంలోకి దింపారు.

ఓల్డ్ సిటీ పరిధిలోని చాంద్రాయణగుట్టలో నిర్మించిన ప్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించబోతున్నారు. నిజానికి ఈ కార్యక్రమం ఈనెల 23నే జరగాల్సి ఉంది. అయితే రాజాసింగ్ వివాదాస్పద వీడియో బయటికి రావడం, పాతబస్తీలో ఎంఐఎం కార్యకర్తల ఆందోళనతో కార్యక్రమం వాయిదా పడింది. శనివారం ఫ్లై ఓవర్ ను ప్రారంభించబోతున్నారు మంత్రి కేటీఆర్. మరోవైపు ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ పెట్టడానికి నిరసనగా హిందూ సంఘాలు నిరసనకు పిలుపిచ్చాయి. భజరంగదళ్, వీహెచ్‌పీ కార్యకర్తలు ఆందోళనకు పిలుపిచ్చాయి. మంత్రి కేటీఆర్ పర్యటనలో నిరసన తెలిపే అవకాశం ఉండటంతో పోలీసులు ముందే అలర్ట్ అయ్యారు. కేటీఆర్ పర్యటించనున్న చాంద్రాయణగుట్టతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. రాపియ్ యాక్షన్ ఫోర్స్ ను రంగంలోకి దింపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News