TS E Challan: భారీ ఆఫర్.. ఇవాళే లాస్ట్ ఛాన్స్.. వెంటనే చెల్లించండి

TS E Challan Discount Offer: మీ వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లు ఇంకా చెల్లించలేదా..? టైమ్ ఉందిలే అని ఆలస్యం చేస్తున్నారా..? ఇక ఏ మాత్రం టైమ్ వేస్ట్ చేయకండి. నేటి రాయితీ గడువు ముగియనుంది. డిస్కౌంట్‌తో చెల్లించే అవకాశం మరికొన్ని గంటలు మాత్రమే ఉంది.   

Written by - Ashok Krindinti | Last Updated : Jan 31, 2024, 01:24 PM IST
TS E Challan: భారీ ఆఫర్.. ఇవాళే లాస్ట్ ఛాన్స్.. వెంటనే చెల్లించండి

TS E Challan Discount Offer: వాహనదారులకు ముఖ్యగమనిక. ట్రాఫిక్ చలాన్లపై ఇచ్చిన భారీ ఆఫర్ గడువు నేటితో ముగియనుంది. పెండింగ్ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం రాయితీ గడువు జనవరి 31తో ముగియనుండగా.. ఇంకా చెల్లించలేని వారు వెంటనే క్లియర్ చేసుకోండి. ఇవాళ గడువు ముగిస్తే.. డిస్కౌంట్‌తో చెల్లించే అవకాశం ఉండదని పోలీస్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఒకసారి గడువు పొడగించగా.. మరోసారి పొడగించే అవకాశం లేదని అంటున్నారు. గతేడాది డిసెంబర్ 27వ తేదీ నుంచి భారీ డిస్కౌంట్‌తో పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ముందుగా 15 రోజులు అవకాశం ఇవ్వగా.. ఆ తరువాత ఈ నెల 31వ తేదీ వరకు పొడగించింది. 

ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 80 శాతం, ఆర్టీసీ బస్సులు 90, ఇతర వాహనాలకు 60 శాతం డిస్కౌంట్ కల్పించింది. ప్రభుత్వం భారీ డిస్కౌంట్లు కల్పిస్తున్నా.. వాహనదారుల నుంచి పెద్దగా స్పందన రావడం లేదని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్ల 59 లక్షల పెండింగ్‌ చలాన్లు ఉండగా.. ఇప్పటివరకు 40 శాతానికి పైగా మాత్రమే చెల్లించినట్లు తెలిసింది. ప్రభుత్వానికి రూ.135 కోట్ల ఆదాయం సమకూరింది. హైదరాబాద్‌ కమిషనరేట్ పరిధిలోని వాహనదారుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరోసారి గడువు పొడగించే అవకాశం లేదని.. ఈసారి వాహనదారులు పెండింగ్ చలాన్లు చెల్లించాల్సిందేనని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. 

వాహనదారులు తమ పెండింగ్ చలాన్ల వివరాలను https://echallan.tspolice.gov.in వెబ్ సైట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. మీ వెహికల్ నంబరు ఎంటర్ చేసి.. మీ వాహనాలపై పెండింగ్ చలాన్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ ఉంటే వెంటనే డిస్కౌంట్‌లో చెల్లించి క్లియర్ చేసుకోండి. చలాన్లను మీ సేవ, పేటీఎం, టీ వ్యాలెంట్‌, నెట్‌బ్యాకింగ్‌ ద్వారా చెల్లించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఫేక్ వెబ్‌సైట్లను ఓపెన్ చేసి మోసపోవద్దని.. అధికారిక వెబ్‌సైట్‌లోనే చెల్లించాలని చెబుతున్నారు. చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. రాయితీ గడువు ముగిసినా పెండింగ్ చలాన్లు చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.  

Also Read: APPSC Notification 2024: 1.80 లక్షల జీతంతో ఏపీలో డిగ్రీ కళాశాల లెక్చరర్ పోస్టుల భర్తీ, నోటిఫికేషన్ విడుదల

 Also Read: Tortoise Ring Benefits: తాబేలు ఉంగరం ఈ వేలికి పెట్టుకుంటే ఎవ్వరైనా ధనవంతులవుతారట..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News