Traffic Restrictions in Hyderabad: హైదరాబాద్‌లో రేపు (మార్చి 6) ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. హైదరాబాద్ షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఆదివారం 2కె, 5కె రన్ నిర్వహించనున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఉదయం 6.30గంటలకు షీ టీమ్స్ 2కె, 5కె రన్ ప్రారంభం కానుంది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ 2కె, 5కె రన్ చేపట్టనున్నారు. 'సుస్థిరమైన రేపటి కోసం ఈరోజు లింగ సమానత్వం' అనే నినాదంతో ఈ రన్‌ను నిర్వహిస్తున్నారు.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా :
వివి విగ్రహం నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే వాహనాలను షాదాన్, నిరంకారి భవన్ వైపు మళ్లిస్తారు.
అంబేడ్కర్ విగ్రహం వైపు నుంచి వచ్చే వాహనాలను ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు.
ఇక్బార్ మినార్ నుంచి అప్పర్ ట్యాంకర్ బండ్ వైపు వచ్చే వాహనాలను తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా మళ్లిస్తారు.
లిబర్టీ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వెళ్లే వాహనాలను ఇక్బాల్ మినార్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా మళ్లిస్తారు.
కర్బలా నుంచి ట్యాంక్ బండ్ మీదుగా అంబేడ్కర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలను లోయర్ ట్యాంక్ బండ్‌లోని డీబీఆర్ మిల్స్ వైపు మళ్లిస్తారు.
నల్లగుట్ట, సంజీవయ్య పార్క్ వైపు నుంచి వచ్చే వాహనాలను రాణిగంజ్ ఎక్స్ రోడ్స్ వైపు మళ్లిస్తారు.
డీబీఆర్ మిల్స్ వద్ద ట్రాఫిక్‌ను చిల్డ్రన్ పార్క్ వైపు అనుమతించరు.
షీ టీమ్స్ నిర్వహించే 2కె, 5కె రన్లో పాల్గొనాలనుకునేవారు www.ifinish.in ద్వారా తమ పేరును రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. శనివారం (మార్చి 5) సాయంత్రం 6గంటల లోపు పేరు నమోదు చేసుకోవాలి. ఇందులో పాల్గొనేవారికి నిర్వాహకులు టీషర్ట్ అందిస్తారు. రన్‌ను పూర్తి చేసినవారికి మెడల్‌తో పాటు బ్రేక్ ఫాస్ట్ కిట్ అందిస్తారు.
Also Read: Mulugu Road Accident: ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అక్కడికక్కడే మృతి
Also Read: Horoscope Today March 5 2022: రాశి ఫలాలు.. వివాహ విషయంలో ఆ రాశి వారికి కీలక సూచన..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook