TGPSC announced Telangana Group 2 exam 2024 postponed to December: తెలంగాణలో కొన్ని రోజులుగా నిరుద్యోగులు గ్రూప్స్ 2 ఎగ్జామ్ లను వాయిదా వేయాలంటూ కూడా నిరసలను చేపట్టారు. ఇటీవల కాలంలో విద్యార్థులు నిరసనలు కూడా తీవ్రతరమయ్యాయి. ఈ నేపథ్యంలో నిరుద్యోగ అభ్యర్థులు పెద్ద ఎత్తున అశోక్ నగర్, దిల్ సుఖ్ నగర్ ప్రాంతాలలో హస్టల్ ల నుంచి బైటకు వచ్చి మరీ నిరసలను చేపట్టారు. మరోవైపు చిక్కడ పల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద కూడా నిరుద్యోగ అభ్యర్థులు నిరసలను చేపట్టారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్స్, డీఎస్సీ ఎగ్జామ్ ల ఘటన తీవ్ర చర్చనీయాశంగా మారింది.
దీనిపై నిరుద్యోగులు ఒకవైపు రోడ్డెక్కి ప్రభుత్వానికి తమ గోడును చెబుతూనే,మరోవైపు రాజకీయ నేతలు, విద్యావేత్తలను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. డీఎస్సీకి, గ్రూప్స్ 2 కు గ్యాప్ తక్కువగా ఉందని, అందుకే చదువు కోవడానికి తమకు సమయంకావాలని కూడా అధికారులను రిక్వెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగులు మంత్రులు, అధికారులను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు, అధికారులు సైతం సీఎంలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దీనికి సీఎం రేవంత్ సైతం పలువురు మేధావులు, టీజీపీఎస్సీ అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు.
ఈ క్రమంలో టీజీపీఎస్సీ గ్రూప్ ఎగ్జామ్ లను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు నెల 7 ,8 తేదీన జరగాల్సిన గ్రూప్ 2 ఎగ్జామ్ లు డిసెంబర్ కు వాయిదావేసినట్లు అధికారులు ప్రకటించారు. త్వరలో గ్రూప్ 2 ఎగ్జామ్ ను ఎప్పుడు నిర్వహిస్తామో.. తేదీలను ప్రకటిస్తామని కూడా టీజీపీఎస్సీ ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతో నిరుద్యోగులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తమకు ఎగ్జామ్ లకు ప్రిపేర్ అవ్వడానికి సమయం దొరికిందని చాలా మంది నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. నిరుద్యోగులు ప్రధానంగా ఎన్నికలలో కాంగ్రెస్ ఇచ్చిన హమీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా వీరికి బీజేపీ, బీఆర్ఎస్ లు బాసటగా నిలిచాయి.
అనేక సందర్భాలలో నిరుద్యోగులకు సంఘీభావంగా కూడా నిరసనలు చేపట్టాయి. నిరుద్యోగుల్ని పోలీసులు బలవంతంగా అరెస్టులు చేస్తుంటే ఈ పార్టీలు సైతం ఖండించాయి. దీంతో నిరుద్యోగుల అంశంపై మొదట ప్రభుత్వం మోండి వైఖరీతో ఉన్న.. ఆ తర్వాత వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. కాగా, ఇది నిరుద్యోగులు సాధించిన నైతిక విజయమని కూడా పలు పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. ఏది ఏమైన నిరుద్యోగులు మాత్రం.. తమకు ప్రిపేర్ కావడానికి మరింత సమయం దొరికిందని భావిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి