దేశ గతిని మార్చిన పీవీకి భారతరత్న ఇవ్వాలి: కేసీఆర్

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు (PV Narasimha Rao) శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని కలిసి విన్నవిస్తానని చెప్పారు.

Last Updated : Jun 24, 2020, 10:11 AM IST
దేశ గతిని మార్చిన పీవీకి భారతరత్న ఇవ్వాలి: కేసీఆర్

Bharat Ratna For PV Narasimha Rao | పలు రంగాల్లో సంస్కరణలకు నాంది పలికి, దేశ గతిని మార్చిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు (P. V. Narasimha Rao) భారతరత్న (Bharat Ratna) పురస్కారానికి సంపూర్ణ అర్హులని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (K. Chandrashekar Rao) పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణలతోపాటు.. విద్యా, తదితర రంగాల్లో విశిష్ట సేవలందించిన దేశం గర్వించదగ్గ నాయకుడు పీవీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేబినెట్‌లో, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) వద్దకు తానే స్వయంగా వెళ్లి ఈ విషయాన్ని విన్నవిస్తానని కేసీఆర్ పేర్కొన్నారు.

జూన్ 28న పీవీ నరసింహారావు జన్మదినం సందర్భంగా ఆయన శతజయంతి ఉత్సవాలను (centenary celebrations of PV Narasimha Rao) ఘనంగా నిర్వహించేందుకు మంగళవారం సీఎం కేసీఆర్ (CM KCR) ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా కె. కేశవరావు, మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్, దేవులపల్లి ప్రభాకర్, పీవీ కుమారుడు ప్రభాకర్ రావు, పీవీ కుమార్తె వాణిదేవీ, పలువురు ముఖ్యులతో సీఎం సమీక్ష నిర్వహించారు. డిప్రెషన్‌తో ప్రమోషన్ ఐఏఎస్ అధికారి ఆత్మహత్య కలకలం

ఏడాది పొడవునా ఉత్సవాలు..
దేశానికి విభిన్న రంగాల్లో పీవీ అందించిన సేవలను చిరస్మరణీయంగా గుర్తుంచుకునేలా ఆయన శతజయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహిస్తామన్నారు. 28న హైదరాబాద్ లోని పీవీ జ్ఞానభూమిలో, దాదాపు 50దేశాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ వేడుకలను మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యవేక్షిస్తారని, వీటి నిర్వహణ కోసం 10కోట్లను తక్షణమే కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. పార్లమెంటులో పీవీ చిత్రపటం ఏర్పాటుచేయాలని కోరతామని, అసెంబ్లీలో తక్షణమే ఏర్పాటుచేస్తామన్నారు. విద్య, సాహిత్య, రాజకీయ, తదితర రంగాల్లో విశేష క్రుషి చేసిన వారిని ప్రత్యేకంగా గుర్తించి పీవీ స్మారక అవార్డులను క్రమం తప్పకుండా ఇవ్వాలని ఆదేశించారు. వంద శాతం ఫలితాలతో వస్తున్న పతంజలి కరోనా మెడిసిన్ Coronil.. ధరెంతో తెలుసా!

పీవీకి తెలంగాణ ఠీవి అని ప్రతీ తెలంగాణ బిడ్డ గర్వపడేలా చరిత్ర నెలకొల్పారన్నారు. పీవీకి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు, విదేశాల్లోని వ్యక్తులతో అనుబంధం ఉందన్నారు. ఆయన చరిత్ర తెలిసేలా పుస్తకాలను ముద్రించాలన్నారు. దీంతోపాటు ఆయన ఆయారంగాల్లో చేసిన క్రుషిని తెలిపేలా ప్రత్యేక  సంచికలు, సావనీర్ లను తీసుకురావాలని, ఆర్థిక నిపుణులతో వ్యాసాలు రాయించాలని కోరారు. రచయితలు ఆయనకు అక్షర నివాళులర్పించేలా రచనలు చేయాలని కోరారు. ఆయనతో అనుబంధం ఉన్నవారి అభిప్రాయాలను కూడా సేకరించి వారిని కూడా ఉత్సవాల్లో భాగస్వామ్యం చేయాలని కోరారు.  

రామేశ్వరం తరహాలో మెమోరియల్
రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు నిర్మించిన తరహాలోనే హైదరాబాద్ లో పీవీకి మెమోరియల్ ను ఏర్పాటు చేస్తామన్నారు. పీవీ శత జయంతి ఉత్సవాలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (Ram Nath Kovind), ప్రధాని మోదీని, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (Pranab Mukherjee), మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh), ఆయనతో అనుబంధమున్న ప్రతీ ఒక్కరిని ఆహ్వానించాలని ఉత్సవాల కమిటీ సభ్యులకు, అధికారులకు కేసీఆర్ సూచించారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ
 

Trending News