తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ కోసం ఎదురుచూస్తోన్న నిరుద్యోగులకి ఓ గుడ్ న్యూస్.

Last Updated : Feb 3, 2018, 12:21 AM IST
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ కోసం ఎదురుచూస్తోన్న నిరుద్యోగులకి ఓ గుడ్ న్యూస్. రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా వున్న 1,463 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భర్తీ కానున్న ఉద్యోగాల్లో 1,224 సివిల్ అసిస్టెంట్ సర్జన్‌లు, 183 ఆయూష్ మెడికల్ ఆఫీసర్స్, 42 సూపర్ స్పెషలిస్ట్స్, 14 డెంటల్ అసిస్టెంట్ సర్జన్స్, పోస్టులు ఉన్నాయి. 

మొదట తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేషన్ ద్వారానే ఈ పోస్టులని భర్తీ చేయాలని భావించిన ప్రభుత్వం.. ఆ తర్వాత సమయాభావం వల్ల డిపార్ట్‌మెంట్ సెలక్షన్ కమిటీ ద్వారా భర్తీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. వైద్య ఆరోగ్య శాఖలో సంబంధిత ఖాళీల భర్తీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకి ఇది ఓ రకంగా తీపి కబురు కానుంది.

Trending News