Telangana High Court: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు యధాతధమని స్పష్టం చేసిన ఎస్ఈసీ

Telangana High Court: తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై నెలకొన్న వివాదానికి తెరపడింది. కోవిడ్ మహమ్మారి వేళ ఎన్నికలకే రాష్ట్ర ఎన్నికల కమీషన్ మొగ్గు చూపింది. కోవిడ్ నిబంధనల మేరకు ఎన్నికలు యధావిధిగా జరుగుతాయని తెలిపింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 22, 2021, 07:11 PM IST
Telangana High Court: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు యధాతధమని స్పష్టం చేసిన ఎస్ఈసీ

Telangana High Court: తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై నెలకొన్న వివాదానికి తెరపడింది. కోవిడ్ మహమ్మారి వేళ ఎన్నికలకే రాష్ట్ర ఎన్నికల కమీషన్ మొగ్గు చూపింది. కోవిడ్ నిబంధనల మేరకు ఎన్నికలు యధావిధిగా జరుగుతాయని తెలిపింది.

తెలంగాణలో ఐదు మున్సిపాల్టీలు, 2 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నెల 30న ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (State Election Commission) నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఎన్నికలు నిర్వహించడం ప్రమాదమని..నిలిపివేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కోర్టును ఆశ్రయించారు. 

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు (Coronavirus cases)విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని షబ్బీర్ అలీ కోరారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana government) ఇప్పటికే నైట్ కర్ఫ్యూను అమలు చేసిందని..ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటీషనర్ కోరారు. కాగా లంచ్ మోషన్ పిటిషన్‌ను విచారించేందుకు హైకోర్టు (High Court) ఛీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ నిరాకరించారు. ఎన్నికల కమిషన్‌కు మరోసారి విన్నవించాలని పిటీషనర్‌కు చీఫ్ జస్టిస్ సూచించారు. ఇప్పటికే హైకోర్టు సింగిల్ బెంచ్ ఎన్నికలను ఆపలేమని చెప్పడంతో డివిజన్ బెంచ్‌లో పిటీషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఎస్ఈసీ మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) నిర్వహణపై స్పష్టత ఇచ్చింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ యధావిధిగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పార్ధసారధి తెలిపారు. 

Also read: Remdesivir Injections: రెమ్‌డెసివిర్ కేటాయింపులపై కేంద్రం తీరుపై మంత్రి ఈటెల విమర్శలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News