/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Telangana Police Vacancies: తెలంగాణలో ఆయా ప్రభుత్వ శాఖల్లో ఖాళీల వివరాలను సేకరించేందుకు ఐఏఎస్ శేషాద్రి అధ్యక్షతన కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ తాజాగా పోలీస్ శాఖలో ఖాళీలపై ఒక నిర్ధారణకు వచ్చింది. పోలీస్ శాఖలో దాదాపు 17వేల ఖాళీలను గుర్తించింది. ఇందులో 16 వేల కానిస్టేబుల్ పోస్టులు, 1 వెయ్యి ఎస్సై పోస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీస్ శాఖతో సహా వివిధ శాఖల్లో మొత్తం 75 వేల ఖాళీలను కమిటీ గుర్తించినట్లు సమాచారం.  ప్రభుత్వ ఆదేశాలు అందిన వెంటనే.. ఈ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.

నిజానికి గతేడాదే పోలీస్ శాఖలో ఖాళీలను భర్తీ చేయాలని భావించినప్పటికీ.. సాంకేతిక కారణాలతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. డిసెంబర్, 2020లో ప్రభుత్వం 50వేల ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు ప్రకటన చేయగా.. అందులో దాదాపు 20వేల పోలీస్ కొలువులు ఉండనున్నట్లు అంచనా వేశారు. ప్రభుత్వం నుంచి వచ్చిన కొలువుల భర్తీ ప్రకటనతో ఎంతోమంది నిరుద్యోగులు ప్రిపరేషన్‌లో మునిగిపోయారు. చాలామంది కోచింగ్ సెంటర్లలో చేరారు. కానీ ఏడాది గడిచినా ఇప్పటికీ కొలువుల నోటిఫికేషన్ లేకపోవడంతో నిరుద్యోగుల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తి నెలకొంది. మధ్యలో హుజురాబాద్ ఎన్నికల సమయంలోనూ కొలువుల భర్తీ అంశం తెర పైకి రాగా.. ఆ తర్వాత కొద్దిరోజులకే దాని ఊసు లేకుండా పోయింది. దీంతో కొలువుల భర్తీ ప్రక్రియ కేవలం ఎన్నికల స్టంటేనని నిరుద్యోగులు, ప్రతిపక్షాలు విమర్శిస్తున్న పరిస్థితి.

తెలంగాణలో వచ్చే ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ప్రభుత్వం కొలువుల భర్తీపై ఫోకస్ పెట్టే అవకాశం లేకపోలేదు. ఐఏఎస్ కమిటీ నుంచి వివిధ శాఖల్లో ఖాళీలపై నివేదిక అందిన వెంటనే సీఎం కేసీఆర్ దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఆలస్యమైనందునా త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టవచ్చుననే వాదన బలంగా వినిపిస్తోంది. 

Also Read: Bappi Lahiri Telugu Songs: చిరంజీవికి మంచి హిట్స్ ఇచ్చిన బప్పి లాహిరి.. తెలుగు టాప్ సాంగ్స్ ఇవే!!

Also Read: Gangubai Kathiawadi: నా తల్లిని 'వేశ్య'ను చేశారు.. 'గంగూబాయి' సినిమాపై తిరగబడుతున్న ఆమె ఫ్యామిలీ...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Section: 
English Title: 
telangana police vacancies ias sheshadri committee spots 17 thousand vacancies in police department
News Source: 
Home Title: 

TS Police Vacancies: పోలీస్ శాఖలో తేలిన ఖాళీల లెక్క.. త్వరలో 17వేల కొలువుల భర్తీ..?

TS Police Vacancies: పోలీస్ శాఖలో తేలిన ఖాళీల లెక్క.. త్వరలో 17వేల కొలువుల భర్తీ..?
Caption: 
Telangana Police Vacancies: (Representational Image)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

తెలంగాణ పోలీస్ శాఖలో తేలిన ఖాళీల లెక్క

దాదాపు 17వేల ఖాళీల గుర్తింపు

ప్రభుత్వం ఆదేశిస్తే త్వరలో నోటిఫికేషన్ 

Mobile Title: 
TS Police Vacancies: పోలీస్ శాఖలో తేలిన ఖాళీల లెక్క.. త్వరలో 17వేల కొలువుల భర్తీ..?
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Wednesday, February 16, 2022 - 10:42
Request Count: 
86
Is Breaking News: 
No