Revanth Reddy:ప్రతి రైతుకు అండగా ఉంటాం..రచ్చబండలో రేవంత్‌రెడ్డి..!

Revanth Reddy:తెలంగాణలో కాంగ్రెస్‌ దూకుడు పెంచింది. వరుస కార్యక్రమాలతో ప్రజలకు చేరువవుతోంది. టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమంటోంది. రైతుల సమస్యలపై పోరు బాట పట్టిన ఆ పార్టీ తాజాగా రచ్చ బండ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 21, 2022, 04:07 PM IST
  • స్పీడ్ పెంచిన తెలంగాణ కాంగ్రెస్
  • రైతు రచ్చబండతో ప్రజల్లోకి నేతలు
  • అన్నదాతకు అండగా ఉంటామని హామీ
Revanth Reddy:ప్రతి రైతుకు అండగా ఉంటాం..రచ్చబండలో రేవంత్‌రెడ్డి..!

Revanth Reddy:తెలంగాణలో కాంగ్రెస్‌ దూకుడు పెంచింది. వరుస కార్యక్రమాలతో ప్రజలకు చేరువవుతోంది. టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమంటోంది. రైతుల సమస్యలపై పోరు బాట పట్టిన ఆ పార్టీ తాజాగా రచ్చ బండ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నేతలంతా గ్రామాల్లో రైతు రచ్చబండ కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్య నేతలంతా క్షేత్ర స్థాయిలో రైతు రచ్చబండలో పాల్గొని రైతుల సమస్యలను తెలుసుకుంటున్నారు. 

వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో జరిగిన రైతు రచ్చబండ కార్యక్రమంలో పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా రైతుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌పై గ్రామస్థులతో ముచ్చటించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను అన్నదాతలకు వివరించారు. తాము అధికారంలోకి రాగానే రైతాంగానికి పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు.

ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద ఎకరాలకు రూ.15 వేలు ఇస్తామన్నారు. అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని..ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేస్తుందని చెప్పారు. అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు చేస్తామని..రైతు కమిషన్‌ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. పంటల బీమా కల్పిస్తామని హామీ ఇచ్చారు రేవంత్‌రెడ్డి. పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని..చక్కెర పరిశ్రమలకు రీఓపెన్ చేస్తామన్నారు. 

రంగారెడ్డి జిల్లా కందుకూరుమండలం నెదునూరు రైతు రచ్చబండ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈసందర్భంగా రైతులను భరోసా ఇచ్చారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌ వివరాలను అన్నదాతలకు వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు పెద్దపీట వేస్తామన్నారు. అన్నదాత కోసం ప్రత్యేక కార్యక్రమాలు తీసుకొస్తామని హామీనిచ్చారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు.

జగిత్యాల జిల్లా పోలాసలో జరిగిన రచ్చబండలో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్(CONGRESS) అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ ధరలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. గతంలో రైతులకు మద్దతు ధర కల్పించిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని చెప్పారు. తెలంగాణలో ప్రస్తుతం అమలు అవుతోందని రుణమాఫీ కాదని..వడ్డీ మాఫీ మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని రైతులు గుర్తించుకోవాలన్నారు. 

Also read:Flipkart Offer: ఫ్లిప్‌కార్ట్ ఆఫర్.. రూ.44వేల విలువ చేసే ఐఫోన్ కేవలం రూ.3725కే... 

Also read:Buggana on Yanamala: అంతర్జాతీయ నియమాలు, నిబంధనలు తెలియవా..యనమలకు బుగ్గన కౌంటర్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News